హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lalu Prasad Yadav: బెయిలొచ్చినా జైళ్లోనే లాలూ... బీహార్ లో ఆర్జేడీకి ఎదురుదెబ్బే..

Lalu Prasad Yadav: బెయిలొచ్చినా జైళ్లోనే లాలూ... బీహార్ లో ఆర్జేడీకి ఎదురుదెబ్బే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్ లో గడ్డి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దిరోజులుగా జైళ్లోనే ఉంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ వచ్చింది. కానీ ఆయన జైళ్లోనే ఉండనున్నారు.

  • News18
  • Last Updated :

బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా తెలిసిన రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తన హయాంలో అవిభక్త బీహార్ లో  జరిగిన గడ్డి కుంభకోణం కేసులో అవినీతికి పాల్పడినట్టు  ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినా లాలూ మాత్రం జైళ్లోనే ఉండాల్సి ఉంది.

దాణా కుంభకోణంలో చాయ్బస ట్రెజరీకి సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ రాగా.. దుంకా ట్రెజరీలో ఆయన జైళ్లోనే ఉండాల్సి ఉంది. దీంతో చాలాకాలం తర్వాత లాలూ కు బెయిల్ వచ్చినా.. ఆయన మాత్రం జైలు దాటి రాని పరిస్థితి ఏర్పడింది. దాణా కుంభకోణానికి సంబంధించి.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్యాంకు నుంచి రూ. 33 కోట్లు డ్రా చేశారని ఆరోపణలున్నాయి.

కాగా బీహార్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ అనుభవరాహిత్యం కారణంగా వెనుకబడుతున్నది. ఆయన కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ లు నెట్టుకొస్తున్నా.. వాళ్లెవరూ లాలూ లా ప్రభావం చూపలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. లాలూ బయిటికొస్తే ఆయన రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయగలరని ఆయన కుమారులతో పాటు ఆర్జేడీ క్యాడర్ కూడా భావించింది.

ఒకవైపు జేడీ(యూ), బీజేపీ ల కూటమి ప్రచారంలో దూసుకుపోతుండగా.. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది. గురువారం రాత్రి ఆ పార్టీ అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలు బోలెడున్నాయి. ఎటొచ్చి.. పెద్ద దిక్కు లేకుండా ఉన్న పార్టీ అంటే ఆర్జేడీనే. ఎన్నికల నాటికి ఎలాగైనా బయటకు వస్తారని ఆశించిన ఆర్జేడీ యువ నాయకులకు, క్యాడర్ కు ఈ తీర్పు తీవ్ర ఆశాభంగం కలిగించేదే. గతంలో ఆయనకు డియోఘర్ ట్రెజరీకి సంబంధించిన కేసులోనూ బెయిల్ వచ్చినా.. మిగిలిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటుడం వల్ల జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీహార్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు  సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి  చేసుకున్నాయి.  కానీ ఆర్జేడీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. ఆ ప్రయత్నాలను గండి కొడతామని ఎన్డీయే చెబుతున్నది.

First published:

Tags: Bihar, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు