హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tej Pratap Yadav: లాలు పెద్ద కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమం

Tej Pratap Yadav: లాలు పెద్ద కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమం

తేజ్ ప్రతాప్ యాదవ్(ఫైల్ ఫోటో)

తేజ్ ప్రతాప్ యాదవ్(ఫైల్ ఫోటో)

తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే... ఆమె తల్లి రబ్రీ దేవి, సోదరుడు తేజస్వీ యాదవ్ అతడిని చూసేందుకు వచ్చారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్ద కుమారుడి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ఉన్నట్టుండి ఆయన హఠాత్తుగా కిందపడిపోవడంతో.. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే... ఆమె తల్లి రబ్రీ దేవి, సోదరుడు తేజస్వీ యాదవ్ అతడిని చూసేందుకు వచ్చారు. ఈ పరిణామంతో ఆర్జేడీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, ఆర్జేడీ పలు ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనున్నాయి.

ఇందుకు సంబంధించిన సీట్ల సర్ధుబాటు కూడా కొలిక్కి వచ్చింది. దీనిపై ప్రకటన చేయడమే తరువాయి అనే తరుణంలో తేజ్ ప్రతాప్ అనారోగ్యానికి గురికావడం ఆర్జేడీ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీహార్‌లో ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ... తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా రాజకీయాల్లో తనదైన మార్కు చూపించాలని భావిస్తున్నాడు. అయితే భిన్నమైన మనస్తత్వం కారణంగా తేజ్ ప్రతాప్ యాదవ్ అనేకసార్లు వార్తల్లో నిలిచారు. తన వివాహం విషయంలోనూ వివాదాలను ఎదుర్కొన్న తేజ్ ప్రతాప్ యాదవ్.. విచిత్రమైన వేషధారణలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే ఉన్నట్టుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడానికి కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేయనుండగా, ఆర్జేడీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. వామపక్షాలు సహా ఇతర పార్టీలకు 29 సీట్లు కేటాయించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే కూటమితో పాటు రాష్ట్రానికి కూడా తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

First published:

Tags: Lalu Prasad Yadav

ఉత్తమ కథలు