LAKSHADWEEP THE GOVERNMENT CANCELED THE HOLIDAY FOR THE SCHOOLS THERE ON FRIDAY ANGER OF THE OPPOSITION EVK
Lakshadweep: అక్కడ పాఠశాలలకు శుక్రవారం సెలవు రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రతిపక్షాల ఆగ్రహం!
ప్రతీకాత్మక చిత్రం
లక్షద్వీప్ (Lakshadweep)లో ప్రభుత్వం తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు వారాంతపు సెలవును శుక్రవారం తొలగించి ఆదివారంగా మార్పు చేసింది.
లక్షద్వీప్ (Lakshadweep)లో ప్రభుత్వం తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు వారాంతపు సెలవును శుక్రవారం తొలగించి ఆదివారంగా మార్పు చేసింది. ఈ విధానం కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. లక్షద్వీప్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 96శాతం ముస్లిం జనాభా ఉంది. దీంతో మతపరమైన ప్రార్థనలు, అంశాల కోసం పాఠశాలలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో శుక్రవారం సెలవు స్థానంలో ఆదివారం సెలవు ప్రకటించారు. ఈ నెల డిసెంబర్ 17, 2021న విద్యాశాఖ పాఠశాల సమయాలు, విద్యా ప్రణాళికపై సమీక్ష నిర్వహించింది. అనతరం పాఠశాలల కార్యకలాపాలకు సంబంధించిన మార్పులు చేసింది.
లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం. కావడంతో అక్కడి నిర్ణయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొంటుంది. ఇక మీద శుక్రవారాల్లో తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం శుక్రవారం ప్రార్థనలను అనుమతించేలా సమయాలను సర్దుబాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రతిపక్షాల ఆగ్రహం..
ఈ నిర్ణయంపై లక్షద్వీప్ (Lakshadweep) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మహమ్మద్ ఫైజల్ పిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఏకపక్షం అని ప్జల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపితే మాత్రమే స్థానిక సమస్యలను అర్థం చేసుకోగలడు. ఇక్కడ, అతను నిర్ణయిస్తాడు. విద్యా శాఖ డైరెక్టర్‌కు ఉత్తర్వు విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే, శుక్రవారం ఉదయం దీవులలో మదర్సా వ్యవస్థ ప్రబలంగా ఉంది. కొత్త టైమింగ్స్ అందరికీ ఇబ్బంది పడుతారని అన్నారు.
ఇటీవల లక్షద్వీప్ కొత్త పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ కొత్తగా తీసుకురావాలని చూస్తున్న లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021).. అక్కడి ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ డ్రాఫ్ట్‌ను వెనక్కు తీసుకోవాలంటూ సేవ్ లక్షద్వీప్ ఉ ద్యమం నడుస్తోంది. డెవలప్మెంట్ పేరుతో మేం పుట్టి పెరిగిన నేలను మాకు దూరం చేస్తున్నారని, ఆచారాలు, వ్యవహారాలను అడ్డుకునేలా పాలనాధికారి వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నీటి అడుగున 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.