India-China: సరిహద్దులో ఉద్రిక్తత.. చైనా మంత్రిని కలవనున్న రాజ్‌నాథ్

పలుమార్లు మిలటరీ అధికారుల చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తొలిసారిగా రక్షణశాఖ మంత్రులు కలవబోతున్నారు.

news18-telugu
Updated: September 4, 2020, 2:02 PM IST
India-China: సరిహద్దులో ఉద్రిక్తత.. చైనా మంత్రిని కలవనున్న రాజ్‌నాథ్
చైనా మంత్రిని కలవనున్న రాజ్‌నాథ్
  • Share this:
నాలుగు నెలలుగా భారత్, చైనా సరిహద్దు రగులుతోంది. గల్వాన్ లోయ ఘర్షణ మొదలుకొని నిన్నటి పాంగాంగ్ లేక్ ఫైట్ వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుదేశాల రక్షణశాఖలు రంగంలోకి దిగాయి. పలుమార్లు మిలటరీ అధికారుల చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తొలిసారిగా రక్షణశాఖ మంత్రులు కలవబోతున్నారు. భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సు కోసం మాస్కోకు వెళ్లారు. చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీ కూడా అక్కడే ఉన్నారు. సదస్సు ముగిసిన తర్వాత వీరుద్దరు సమావేశమై సరిహద్దు వివాదంపై చర్చించనున్నారు.

ముందుగా చైనా దౌత్య అధికారులు భారత్‌కు సమాచారం ఇచ్చారు. తమ రక్షణ మంత్రి మీ రక్షణ మంత్రితో భేటీ కావాలనుకుటున్నారని తెలిపారు. దానికి భారత ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో సదస్సు పూర్తయ్యా వీరివురు సమావేశమై.. ఆర్మీ మోహరింపు, పాంగాంగ్ ఘర్షణలపై చర్చించనున్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం కేవలం దౌత్యపరంగా, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన వచ్చింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరిద్దరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

ఆగస్టు 29న అర్ధరాత్రి సరిహద్దుల్లో చైనా ఆర్మీ మళ్లీ చెలరేగిన విషయం తెలిసిందే. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడంతో భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా ఎత్తును చిత్తు చేస్తూ.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది భారత సైన్యం. అంతేకాదు ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో మోహరించి చైనా ఒత్తిడి పెంచింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా తరలించింది. ఈ క్రమంలోనే చైనా మెల్లగా దిగొస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీకి ముందుకొచ్చింది.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading