హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ladakh Earthquake: అర్థరాత్రి అలజడి.. లద్దాఖ్‌ను వణికించిన భూకంపం.. మయన్మార్‌లోనూ..

Ladakh Earthquake: అర్థరాత్రి అలజడి.. లద్దాఖ్‌ను వణికించిన భూకంపం.. మయన్మార్‌లోనూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ladakh Earthquake: శుక్రవారం అర్ధ రాత్రి లేహ్ పట్టణంలో భూమి కంపించింది. 12.30 నిమిషాల సమయంలో పలు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ (National Center of sismology) తెలిపింది.

ఇంకా చదవండి ...

  కేంద్ర పాలితప్రాంతం లద్దాఖ్‌‌(Ladakh)లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధ రాత్రి లేహ్ పట్టణంలో భూమి కంపించింది. 12.30 నిమిషాల సమయంలో పలు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ (National Center of sismology) తెలిపింది. లేహ్‌ (Leh) నగరానికి తూర్పు, ఈశాన్య దిశగా 206 కి.మీ. దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు వెల్లడించిది. ఐతే స్వల్ప భూకంపమే కావడంతో.. ఎలాంటి నష్టం జరగలేదు. ఇది చిన్నదే అని ఎవరూ భయపడాల్సిన పనిలేదని అధికారులు పేర్కొన్నారు.

  PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా ? 10వ విడత డబ్బులు

  అంతకుముందు మయన్మార్‌ను కూడా భూకంపం వణికించింది. గురువారం రాత్రి 11.58 నిమిషాల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు NCS వెల్లడించింది. బర్మాకు పశ్చిమ, వాయవ్య దిశగా 144 కి.మీ. దూరంలోభూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మయన్మార్ అధికారులు పేర్కొన్నారు.

  Petrol Rates: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే

  గురువారం పాకిస్తాన్‌లోనూ ఓ భూకంపం వచ్చింది. ఉదయం 03.31 సమయంలో హర్నాయ్ ప్రాంత సమీపంలో భూమి కంపించింది. క్వెటా (Quetta) నగరానికి తూర్పు-ఈశాన్య దిశగా 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్ర 5.7గా ఉందని యూరోపియన్ మెడిటేరియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMSC) , అమెరికాకు చెందిన యూఎస్ జియోలాజికల్ సర్వే  (USGS)  పేర్కొనగా.. భారత్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ మాత్రం 6.0గా వెల్లడించింది. భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు కూలిపోయింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 20 మందికి పైగా మృతి చెందారు.

  గతంలోనూ పలు భూకంపాలు పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టించాయి.2015 అక్టోబరులో పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు దాదాపు 400 మంది మరణించారు. 2005లో 7.6 తీవ్రతతో సంభవించిన భూంకంపం వేలాది మందిని బలితీసింది. ఏకంగా 73వేల మంది మరణించారు. దాదాపు 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద భూకంపంగా దీనిని పేర్కొంటారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Earthquake, Ladakh

  ఉత్తమ కథలు