డాన్స్‌తో అదరగొట్టిన బీజేపీ ఎంపీ...లద్దాఖ్‌ కొండల్లో డప్పుల మోత

గౌచా (లద్దాఖ్ సంప్రదాయ దుస్తులు) ధరించి ట్రెడిషనల్ డాన్స్‌తో అదరగొట్టారు నంగ్యాల్. అంతేకాదు డ్రమ్స్ వాయించి స్థానికుల్లో ఉత్సాహం నింపారు.

news18-telugu
Updated: August 15, 2019, 4:28 PM IST
డాన్స్‌తో అదరగొట్టిన బీజేపీ ఎంపీ...లద్దాఖ్‌ కొండల్లో డప్పుల మోత
బీజేపీ ఎంపీ నంగ్యాల్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దుపై లద్దాఖ్ ఎంపీ జమయాంగ్ సెరింగ్ నంగ్యాల్ పార్లమెంట్‌లో అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ బీజేపీ యువ ఎంపీ తాజాగా మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానికులతో కలిసి లేహ్‌లో పంద్రాగస్టు వేడుకలను ఆయన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గౌచా (లద్దాఖ్ సంప్రదాయ దుస్తులు) ధరించి ట్రెడిషనల్ డాన్స్‌తో అదరగొట్టారు నంగ్యాల్. అంతేకాదు డ్రమ్స్ వాయించి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు