EPFO : పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు..!

EPFO : 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరిస్తుందని ఆ శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ తెలిపారు.

news18-telugu
Updated: August 30, 2019, 6:02 PM IST
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు..!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 30, 2019, 6:02 PM IST
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరిస్తుందని ఆ శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ తెలిపారు. పీఎఫ్‌ డిపాజిట్లపై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు అభ్యంతరం లేదని, త్వరలోనే దీనిపై నోటిఫికేషన్‌ విడుదలవుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది పీఎఫ్‌ చందాదారులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. వాస్తవానికి ఫిబ్రవరిలో సంతోష్‌ గాంగ్వర్‌ నేతృత్వంలోని ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి, ఈ మేరకు వడ్డీ పెంచేందుకు సభ్యుల ఆమోదం తీసుకుంది.

ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు బదిలీ చేసింది. డీఎఫ్‌ఎస్‌ ఏప్రిల్‌లో 2018-19 సంవత్సరానికి పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాగా, ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నోటిఫై చేయాల్సి ఉంది. ప్రకటన విడుదలయ్యాక పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయనుంది.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...