12 Working Hours a day: త్వరలో రోజుకు 12 గంటల పని. కార్మిక శాఖ కీలక ప్రకటన

త్వరలో రోజుకు 12 గంటల పని. కార్మిక శాఖ కీలక ప్రకటన

12 Working Hours a day: ఇండియాలో వాతావరణాన్ని బట్టీ రోజూ 8 గంటలు పని ఉండాలనే రూల్ ఉంది. ఇప్పుడు దాన్ని 12 గంటలు చేయబోతున్నారు. తాజా మార్పులేంటో తెలుసుకుందాం.

  • Share this:
    12 Working Hours a day: ఇండియాలో ఇప్పటివరకూ షిఫ్టుకి 8 గంటలు... రోజుకు 3 షిఫ్టుల విధానం అమల్లో ఉంది. కేంద్ర కార్మిక శాఖ... రోజుకు 12 పని గంటలు ఉండాలనే ప్రతిపాదన తెచ్చింది. అలాగే... వారానికి మాత్రం 48 గంటలే పని ఉండాలనీ... ఒక వీకాఫ్ ఉండాలని కోరింది. ప్రస్తుతం రోజుకు 8 గంటల చొప్పున... ఆరు రోజుల్లో 48 పని గంటలు ఉంటున్నాయి. కొత్త ప్రతిపాదన కూడా ఇదే విధంగా ఉన్నా... రోజుకు 12 గంటల పని ఉండాలన్న మార్పు కొత్తగా తెచ్చినది. నవంబర్ 19న ఈ డ్రాఫ్ట్ రూల్స్ రెడీ చేసింది కార్మిక శాఖ. నిజానికి రోజుకు 12 గంటల పనిలో.. మధ్యమధ్యలో విశ్రాంతి ఇవ్వాలంటూ రూపొందించిన... ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింక్ కండీషన్స్ (OSH) కోడ్ 2020ని ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్ ఆమోదించింది. అది అమల్లోకి రాలేదు. కారణం... వారంలో వర్కింగ్ అవర్స్ 48 గంటలే ఉండాలనడమే. అలా కాకుండా రోజుకు 12 పని గంటలు ఉంటే... నాలుగు రోజుల్లో 48 గంటలు పూర్తవుతాయి. మిగతా 3 రోజులు వీకాఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సెట్టయ్యేలా లేకపోవడంతో... చాలా మంది దీనిపై విమర్శలు చేశారు. వారానికి 48 గంటల కండీషన్ ఉంది కాబట్టి... ప్రస్తుతం అమలుచేస్తున్న రోజుకు 8 గంటల పనినే అమల్లో ఉంచారు.

    "దేశంలో వాతావరణ పరిస్థితులను లెక్కలోకి తీసుకొనే ఈ ప్రతిపాదన తెచ్చారు. దీని వల్ల వర్కర్లకు ఓవర్ టైమ్ మనీ లభిస్తుంది" అని కార్మిక శాఖలోని ఓ సీనియర్ తెలిపారు. "డ్రాఫ్ట్ రూల్స్‌లో మేం కావాల్సిన మార్పులు చేస్తాం. తద్వారా... వర్కర్లు రోజుకు 8 గంటలకు మించి పని చేసి... ఓవర్ టైమ్ ప్రయోజనాలు పొందేలా చేస్తాం" అని ఆయన వివరించారు. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం... అదనంగా 15 నుంచి 30 నిమిషాలు పనిచేస్తే... దాన్ని 30 నిమిషాలు చేసినట్లుగా నిర్ధారిస్తారు. ఐతే... అరగంట కంటే తక్కువ సేపు అదనంగా పనిచేస్తే... దాన్ని ఓవర్ టైమ్‌గా లెక్కలోకి తీసుకోరు.



    ఇది కూడా చదవండి: Jupiter: మకరరాశిలోకి గురువు.. ఏడాది పాటూ నష్టాలు.. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది?

    "ఏ వర్కర్ అయినా వారానికి 48 గంటలకు మించి పనిచెయ్యకూడదు. పని చేసే సమయంలో వర్కర్ కి విశ్రాంతి కూడా ఇస్తూ ఉండాలి. రోజుకు 12 గంటలకు మించి పని ఉండకూడదు" అని డ్రాఫ్టులో ఉంది. అంతేకాదు... ఏ వర్కరైనా 5 గంటలకు మించి కంటిన్యూగా పని చెయ్యకూడదు. మధ్యలో అరగంట రెస్ట్ ఉండాలి. రోజుకు ఎంత పని చెయ్యాలనేది... వారానికి 48 గంటలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: