Home /News /national /

LABOUR CODES ARE NOT COMING INTO EFFECT FROM JULY 1 UMG GH

Labour Codes: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. అమల్లోకి రాని కొత్త లేబర్ కోడ్స్.. పూర్తి క్లారిటీ ఏంటంటే..?

జూలై 1 నుంచి అమలు కాని లేబర్ కోడ్స్

జూలై 1 నుంచి అమలు కాని లేబర్ కోడ్స్

జులై 1 నుంచి నాలుగు లేబర్‌ కోడ్‌లు అమలు కావడం లేదని, వీటి తుది రూపురేఖలపై చర్చలు కొనసాగుతున్నాయని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మనీకంట్రోల్‌ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు. ఊహాగానాలను నమ్మవద్దని వివరించారు.

జులై 1 నుంచి కొత్త లేబర్‌ కోడ్‌లు అమల్లోకి వస్తాయని విస్తృత ప్రచారం జరిగింది. అయితే నాలుగు కొత్త లేబర్‌ కోడ్స్ అయిన ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్‌ (Industrial Dispute), సోషల్‌ సెక్యూరిటీ, వేజ్ కోడ్ (వేతన చట్టం), వృత్తిపరమైన భద్రత(Occupational Safety)కి సంబంధించి తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి రావడం లేదు. జులై 1 నుంచి నాలుగు లేబర్‌ కోడ్‌లు అమలు కావడం లేదని, వీటి తుది రూపురేఖలపై చర్చలు కొనసాగుతున్నాయని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మనీకంట్రోల్‌ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు. ఊహాగానాలను నమ్మవద్దని వివరించారు. ‘ఇవి నిర్మాణాత్మక సంస్కరణలు. మంత్రిత్వ శాఖ ఒక వైపు కార్మిక సంక్షేమాన్ని సమతుల్యం చేయడం, మరోవైపు వ్యాపారాన్ని సులభతరం చేయడంపై దృష్టిసారించింద’ని మరో అధికారి పేర్కొన్నారు. కేంద్ర కార్మిక శాఖ రాష్ట్రాలు, పరిశ్రమలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతోందని, విషయాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

కార్మిక శాఖ శుక్రవారం (జులై 1) నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమలు చేస్తుందా? అన్న ప్రశ్నకు ఒక శాఖాధికారి లేదని బదులివ్వడం గమనార్హం. పనులు సిద్ధమైనప్పుడు, కోడ్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేస్తుందని, అయితే త్వరలో వాటిని అమలు చేయాలనే ఆలోచన ఏదీ లేదని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మినిస్ట్రీలోని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: లాస్ట్ వర్కింగ్ డే నుంచి 2 రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలు.. కొత్త వేతన కోడ్ మార్గదర్శకాలు ఇవే..!


భారతదేశం 29 కేంద్ర కార్మిక చట్టాలను.. వేతనాలు, సోషల్‌ సెక్యూరిటీ, వృత్తిపరమైన ఆరోగ్యం, ఇండస్ట్రియల్‌ రిలేషన్‌లు అనే నాలుగు కోడ్‌లుగా రూపొందించింది. పార్లమెంట్ 2019 ఆగస్టులో వేతన కోడ్‌ను ఆమోదించగా, మిగిలిన మూడు 2020 సెప్టెంబర్‌లో ఆమోదం పొందాయి. కానీ వాటిలో ఏదీ ఇప్పటి వరకు అమలులోకి రాలేదు.

* పని గంటలపై ఊహాగానాలు
లేబర్ కోడ్‌లు యజమానులు, కార్మికుల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు సుదూర మార్పులను ప్రవేశపెడతాయని భావిస్తున్నారు. స్వల్పకాలిక పని ఒప్పందాలను రూపొందించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని ఇవి అందిస్తాయి. నియామకం, తొలగింపు ప్రక్రియలను సులువుగా చేపట్టేలా చేస్తాయి. పారిశ్రామిక సమ్మెలను నిర్వహించడంపై నియమాలు అమలు చేస్తాయి.



కార్మికులకు ప్రయోజనం చేకూర్చే కొత్త జాతీయ వేతన స్థాయి ఉంటుంది. అనధికారిక, గిగ్ కార్మికులు సామాజిక భద్రత లభిస్తుంది. వేతనాల నిర్వచనంలో మార్పు టేక్-హోమ్ మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు కానీ పదవీ విరమణ పొదుపులను పెంచుతుంది. కొంత మంది వ్యవస్థాపకులు, యజమానులు వీటిని వ్యతిరేకించవచ్చు.. ఎందుకంటే ఇవి ఉద్యోగిపై చేసే ఖర్చును స్వల్పకాలంలో పెంచుతాయి. ఇతర నిబంధనలలో, వారానికి 48-గంటలు పనిచేయడం మారదని వేతన కోడ్ తెలిపింది. కానీ పని గంటలలో కొంత సౌలభ్యం ఉండవచ్చు. ఒక ఉద్యోగి, యజమాని ఒక కేసు-టూ-కేస్ ఆధారంగా అంగీకరిస్తే రోజుకు 12 గంటల వరకు విస్తరించవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Company, Employees, Labour, New Labour Codes

తదుపరి వార్తలు