Rising India Summit: న్యూస్ 18 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న రెండు రోజుల ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’Rising india summit) అట్టహాసంగా జరుగుతోంది. తొలిరోజు బుధవారం పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith shah) మాట్లాడారు. ఇతరులపై ఒక ఒక వేలు చూపినప్పుడు, మరో నాలుగు వేళ్లు మీ వైపు ఉన్నాయని గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. బీజేపీపై ప్రతిపక్షాలు(Opposition parties) చేస్తున్న ఆరోపణలకు ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ వైఖరిని ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. అమిత్ షా ప్రసంగంలోని కీలకాంశాలు ఇలా..
* ఏజెన్సీల దుర్వినియోగంలో నేను బాధితుడిని!
రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. ఆయన గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు తనపై నమోదైన సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును గుర్తు చేసుకున్నారు. ఏజెన్సీలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తనకు తెలుసని, ఆ తరహా చర్యలకు తాను బాధితుడినని అన్నారు.
‘నేను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ కౌంటర్ జరిగింది. నాపై కేసు నమోదైంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నన్ను అరెస్టు చేసింది. నా విచారణలో 90 శాతం ప్రశ్నలలో, నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నానని నన్ను అడిగారు. నేను నరేంద్ర మోదీ పేరు చెబితే వదిలివేస్తామని వారు చెప్పారు. అప్పుడు కూడా మేము నిరసనలు చేయలేదు. నల్ల బట్టలు ధరించలేదు. పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డు తగల్లేదు. మోదీకి వ్యతిరేకంగా సిట్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.’ అని చెప్పారు.
తనకు బెయిల్ ఎలా లభించిందనే వివరాలను అమిత్ షా పంచుకున్నారు. 90వ రోజు, తనకు వ్యతిరేకంగా తగిన రుజువులు లేవని హైకోర్టు భావించడంతో బెయిల్ లభించిందన్నారు. తనపై నమోదైన కేసు ముంబైలో ఉందని, అక్కడ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సీబీఐ తనపై కేసు నమోదు చేసిందని, అయితే తనపై మోపిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఈ వ్యవహారం అంతా జరుగుతున్నప్పుడు చిదంబరం, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ అందరూ అప్పుడు ఉన్నారని పేర్కొన్నారు.
* మోదీ పేరు చెప్పమని పదే, పదే అడిగారు!
‘నా విచారణ మొత్తంలో ‘మోదీ కా నామ్ దే దో, దే దో’(మాకు మోదీ పేరు చెప్పండి) అనే అడిగారు. మోదీని అనవసరంగా ఎందుకు అభాసుపాలు చేయాలి? నా వల్ల చాలా మంది అమాయక పోలీసు అధికారులు జైలు పాలయ్యారు. నేడు అదే కాంగ్రెస్ తమ గతి చూసి ఏడుస్తోంది. వారు వారి ప్రవర్తనను ప్రతిబింబించాలి.’ అని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ హయాంలో భారత ప్రజలు అన్నీ చూశారని, అయితే మేం ఎప్పుడూ నల్లదుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపలేదని షా అన్నారు. మీరు నిర్దోషులైతే చట్టంపై నమ్మకం ఉంచండని చెప్పారు.
వీరసావర్కర్‌పై నానమ్మ ప్రసంగాన్ని రాహుల్ వినాలి- అమిత్ షా@AmitShah @poonawallafinco #News18RisingIndia https://t.co/hTo4LFsFRW
— News18 Telugu (@News18Telugu) March 29, 2023
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఛాతీపై ఎందుకు కొట్టుకుంటున్నారని షా ప్రశ్నించారు. సత్యేందర్ జైన్ నిర్దోషి అయితే, అతనికి ఇంతవరకు ఎందుకు బెయిల్ రాలేదు? మనీష్ సిసోడియా సంగతేంటి? ఇక్కడ కోర్టులు ఉన్నాయి, వారు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.