ప్రయాగ్‌రాజ్‌లో అర్ధకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. నాగసాధువుల విన్యాసాలు..భక్తు పుణ్యస్నానాలతో..ప్రయాగక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గంగా, యుమునా, సరస్వతి పవిత్ర సంగంమంలో పవిత్ర స్నానాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే లక్షలాది భక్తులు అర్ధకుంభమేళాకు వచ్చి వెళ్లారు. ఇంకా లక్షలాది మంది భక్తిజనంతో ప్రయాగ పట్టణం కిటకిటలాడుతోంది.
ప్రయాగలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో జనాలు ఉన్నా..వేల సంఖ్యలో నాగసాధువులు సంచరిస్తున్నా...వారందరిలో కెల్లా ఓ సాధువు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఒంటి నిండా రుద్రాక్షలు..పూలమాలలు..! శిరస్సుపై అరుణవర్ణ ముత్యాల తలపాగా..! చేతికి వెండి గాజులు...వేళ్లకు బంగారు ఉంగరాలు..! చేతిలో పిల్లనగ్రోవి...తలపై నెమలి పింఛంతో శ్రీకృష్ణుడి వేషధారణ..! కుంభమేళాలో కనిపించిన ఓ సాధువు అవరతామిది..! హరే రామ..హరే కృష్ణ కీర్తనలో ప్రయాగ వీధుల్లో తిరుగుతున్నారు ఈ స్వామీజి.
మధ్య ప్రదేశ్‌కు చెందిన ఈ స్వామిజీ..ఉజ్జయిని నుంచి కాలినడకన ప్రయాగరాజ్‌కు వచ్చారు. ఒళ్లంతా ఆభరణాలు, పూలమాలు, రుద్రాక్షలతో ఈయన అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మేకప్‌ని వేసుకునేందుకు ఏకంగా 7 గంటల సమయం పడుతుందట. ప్రతి రోజు ఉదయం 3 గంటలకు మేకప్ వేయడం ప్రారంభిస్తే..ఉదయం 10 గంటలకు పూర్తవుతుంది. అప్పుడే ఆయన రోజువారీ కార్యక్రమాలు మొదలుపెడతారు. 13 ఏళ్ల వయసులో ఉండగా శివుడు తనకు కలో కనిపించాడట..! అప్పటి నుంచి దేవుడి గెటప్ వేస్తున్నారు.
తాను భవిష్యత్ గురించి ఆలోచించని...ప్రస్తుతం ఎలా ఉంటున్నమన్నదే ముఖ్యమని చెబుతారు ఈ స్వామీజి. అందుకే తాను ఇంత సంతోషంగా ఉండగులుతున్నట్లు వెల్లడించారు. ప్రయాగరాజ్‌లో సందడి చేస్తున్న ఈ స్వామీజిని చూసేందుకు కుంభమేళా భక్తులు పోటీపడుతున్నారు. సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.