• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • KUMBH MELA 2021 KUMBH SHOULD NOW BE SYMBOLIC SAYS PRIME MINISTER NARENDRA MODI TO HEAD OF JUNA AKHARA NK

Kumbh Mela 2021: కుంభమేళాపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఏమన్నారంటే...

Kumbh Mela 2021: కుంభమేళాపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఏమన్నారంటే...

కుంభమేళాపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ (File Image)

Kumbh Mela 2021: కుంభమేళా వల్ల కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తుండటంతో... ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Kumbh Mela 2021: సాధారణంగా కుంభమేళా అంటే... దానికి ఉండే ప్రపంచ గుర్తింపు వేరు. ఈసారి మాత్రం కుంభమేళాపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఓవైపు అది మతపరమైన సంప్రదాయం అని కొందరు సమర్థిస్తుంటే... కరోనా సమయంలో రూల్స్ పాటించకుండా నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. ఈ క్రమంలో ఈ అంశానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద సెలబ్రిటీలు... దీనిపై తమదైన శైలిలో పోస్టులు పెడుతుంటే... ఇది మరింత పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... దీనిపై స్పందిస్తూ... జునా అఖారా స్వామి అవధేశానంద్ గిరితో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది కాబట్టి... కుంభ మేళా ఆనేది ఇప్పుడు సింబాలిక్‌గా మాత్రమే ఉండాలని కోరారు.

    కుంభ మేళా సందర్భంగా... పెద్ద ఎత్తున ప్రజలు గుంపులుగా ఉండటంపై హిందు ధర్మ ఆచార్య సభ అధ్యక్షుడు స్వామి అవధేశానంద్ గిరి జీ మహరాజ్‌తో మాట్లాడినట్లు... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... తన ట్వీట్‌లో తెలిపారు.


    ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారో... స్వామి అవధేశానంద్ దేశ ప్రజలకు వినతి చేశారు. ప్రజలెవరూ... పుణ్యస్నానాల కోసం కుంభమేళాకు పెద్ద సంఖ్యలో రావొద్దని కోరారు. అలాగే కరోనా రూల్స్ అంతా పాటించాలని కోరారు.


    దేశంలో కొన్ని వారాలుగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. దానికి తోడు... కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన చాలా మందికి కరోనా సోకింది. మత పరంగా ఇదో ఆచారమే అయినప్పటికీ... ఈసారి కరోనా ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం జరగనివ్వకుండా అడ్డుకుంటోంది. అయినప్పటికీ... ఇప్పటికీ చాలా మంది ఇందులో పాల్గొని పుణ్య స్నానాలు చేశారు.

    ఇది కూడా చదవండి: Coronavirus: ఇండియా, తెలంగాణలో మరింత పెరిగిన కరోనా కేసులు... తాజా అప్‌డేట్స్

    హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య 1700 మందికి పైగా... కరోనా బారిన పడ్డారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందు కార్యక్రమం కావడంతో... దీన్ని ఇంకా కొనసాగిస్తే... కరోనా కేసులు మరింత పెరుగుతాయనే విమర్శలు వస్తున్నాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, రిషికేష్ మొత్తం కలిపి కుంభమేళా 670 హెక్టార్లలో జరుగుతోంది. మొత్తం 48.51 లక్షల మంది ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 మధ్య రెండేసి షాహీ స్నానాలు చేశారు. వారిలో చాలా మంది మాస్కులు ధరించలేదు. సోషల్ డిస్టాన్స్ సరిగా అమలు కాలేదు. పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా కోరారు కాబట్టి... ఇక కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు