కుల్ భూషణ్‌ జాదవ్‌ మరణ శిక్ష అమలుకు పాకిస్తాన్ కొత్త కుట్ర

కుల్‌భూషణ్ జాదవ్ రివ్యూ పిటిషన్ వేయలేదంటే.. ఆయన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి తెలిపేందుకే పాకిస్తాన్ ఈ కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 8, 2020, 6:47 PM IST
కుల్ భూషణ్‌ జాదవ్‌ మరణ శిక్ష అమలుకు పాకిస్తాన్ కొత్త కుట్ర
కులభూషణ్ జాదవ్
  • Share this:
పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌పై పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరదీసింది. ఆయనకు మరణ శిక్ష విధించేందుకు నయా ప్లాన్ వేసింది. మరణ శిక్షపై రివ్యూపై పిటిషన్ వేసేందుకు కుల్ భూషణ్ నిరాకరించారని.. అంతకుముందు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌‌తో ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నారని పాకిస్తాన్ తెలిపింది. ఐతే జాదవ్‌ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు మాత్రం అనుమతి ఇస్తామని ప్రకటించింది.

జూన్‌ 17న కుల్ భూషణ్‌‌కు విధించిన మరణ శిక్షపై సమీక్ష కోరుతూ వ్యాజ్యం దాఖలు చేయడానికి అనుమతించాం. కానీ ఆయన నిరాకరించారు
అహ్మద్‌ ఇర్ఫాన్‌, పాక్‌ అదనపు అటార్నీ జనరల్‌


కాగా, భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ను 2016లో ఇరాన్‌లో పాకిస్తాన్ ఏజెంట్లు పట్టుకున్నారు. కానీ బలూచిస్థాన్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని.. గూఢచారిగా పనిచేస్తున్నాడని ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అనంతరం 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ తీరుపై అభ్యంతర వ్యక్తం చేసిన భారత్.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఐసీజేను ఆశ్రయించింది. ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని వాదించింది. అనంతరం 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది ఐసీజే.

ఆ తర్వాత ఇరుదేశాల వాదనలు విన్న ఐసీజే.. కేసును పున:సమీక్షించి, సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు 2019 జులైలో తీర్పు చెప్పింది. ఐతే ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడానికి అనుమతించినా జాదవ్‌ అందుకు నిరాకరించారని కుట్రలు చేస్తోంది పాక్. కుల్‌భూషణ్ జాదవ్ రివ్యూ పిటిషన్ వేయలేదంటే.. ఆయన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి తెలిపేందుకే పాకిస్తాన్ ఈ కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading