జయహో జగన్.. కర్ణాటకలో ఫ్లెక్సీలకు పాలాభిషేకం..

కర్ణాటకలోని కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమను కూడా ఏపీ తరహాలో ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 19, 2019, 8:16 PM IST
జయహో జగన్.. కర్ణాటకలో ఫ్లెక్సీలకు పాలాభిషేకం..
జగన్ ఫ్లెక్సీలకు దండలు వేసి పాలాభిషేకం చేసిన కేెఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
news18-telugu
Updated: September 19, 2019, 8:16 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్లెక్సీలకు కర్ణాటకలో కొందరు పాలాభిషేకాలు చేశారు. వారంతా కూడా కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులు కావడం విశేషం. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కమిటీ కూడా విలీనానికి సంబంధించి పలు సూచనలు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఏపీలో రవాణా శాఖలో ఉద్యోగులుగా పరిగణించనున్నారు. ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన వేతనాలు, ఇతరత్రా సౌకర్యాలను కూడా అందించనున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. ఇదే అంశం పొరుగు రాష్ట్రాల్లోనూ కూడా సంచలనంగా మారింది. కర్ణాటకలోని కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమను కూడా ఏపీ తరహాలో ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరే కరూర్‌లోని కేఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మరోవైపు తెలంగాణలో సైతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టేవారు స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా స్పందించారు. కర్ణాటకలో కూడా అలాంటి విధానం రావాలంటూ ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా  కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు జగన్‌కు పాలాభిషేకం చేయడం ఆసక్తికరంగా మారింది.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...