హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ట్యాంకులో డీజిల్ లేదు.. కండక్టర్‌తో డబ్బుల్లేవు.. నడిరోడ్డుపై ఆగిపోయిన బస్సు.. తర్వాత ఏం జరిగింది?

ట్యాంకులో డీజిల్ లేదు.. కండక్టర్‌తో డబ్బుల్లేవు.. నడిరోడ్డుపై ఆగిపోయిన బస్సు.. తర్వాత ఏం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బస్సులో ఉన్న ప్రయాణికులు కండక్టర్ వద్దే టికెట్ కొని ఉంటే.. ఆ డబ్బులతో డీజిల్ కొనుకోవచ్చు. కానీ ప్రయాణికులంతా ఆన్‌లైన్ టికెట్లు తీసుకున్నారు. తద్వారా కండక్టర్‌ వద్ద డబ్బులు లేకుండా పోయాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆర్టీసి బస్సుకు అనుకోని కష్టం వచ్చింది. ఫ్యూయెల్ ట్యాంక్‌లో డీజిల్ లేక.. కండక్టర్‌తో డబ్బుల్లేక.. నడిరోడ్డుపై నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కండక్టర్ వద్దే టికెట్ కొని ఉంటే.. ఆ డబ్బులతో డీజిల్ కొనుకోవచ్చు. కానీ ప్రయాణికులంతా ఆన్‌లైన్ టికెట్లు తీసుకున్నారు. తద్వారా కండక్టర్‌ వద్ద డబ్బులు లేకుండా పోయాయి. అదే సమయంలో బస్సులో డీజిల్ అయిపోవడంతో రోడ్డుపై ఆగిపోయింది. ప్రయాణికులంతా ఆందోళనకు దిగారు. సుదూర మార్గంలో ప్రయాణించే బస్సుల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని మండిపడ్డారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభించింది? బస్సు ముందుకు ఎలా కదిలింది.? ఈ ఆసక్తికరమైన ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


  కర్నాటక (Karnataka)కు చెందిన కేఎస్ఆర్టీసీ (KSRTC Bus) బస్సు కొల్లూరు నుంచి తిరువనంతపురం వెళ్తోంది. ఆ బస్సు 750కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. తెల్లవారుఝామున 03.15 నిమిషాలకు కాసర్‌గోడ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తిరువనంతపురం చేరుకోవాలంటే మరో 560 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. కానీ కాసర్‌గోడ్‌(Kasargod Bus Depot)లోకి ఎంటర్ అయిన కాసేపటికే బస్సులో డీజిల్ అయిపోయింది. 750 కి.మీ. లాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు బస్సులో అన్ని కరెక్టుగానే ఉన్నాయో లేదో చూసుకోవాలి. బస్సు కండిషన్‌లో ఉందా? డీజిల్ సరిపడా ఉందా? అని చెక్ చేసుకోవాలి. కానీ ఈ బస్సు విషయంలో అది జరగలేదు. డీజిల్ అయిపోవడం వల్ల కాసర్‌గోడ్‌లో నిలిచిపోయింది. పోనీ డీజిల్ కొందామంటే కండక్టర్ వద్ద డబ్బులు లేవు. అందరూ ఆన్‌లైన్లోనే టికెట్ కొనడంతో అతడి వద్ద చిన్న చిన్న ఖర్చులకు తప్ప పెద్దగా డబ్బు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. కాసర్‌గోడ్ డిపో అధికారులను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. ప్రయాణికులు ఆందోళన.. కండక్టర్ విజ్ఞప్తుల మధ్య.. దాదాపు 2 గంటల తర్వాత... డీజిల్ కొనుగోలు చేసేందుకు రూ.20 వేలు ఇచ్చారు. అనంతరం బస్సులు తిరిగి బయలుదేరి వెళ్లింది.


  ''మేం కూడా గత 20 రోజులుగా ఇంధనం కోసం కష్టపడుతున్నాం. ఇది కరెక్ట్ కాదని ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాను. దూర ప్రయాణాలకు వెళ్లే తమ బస్సుల కండక్టర్ల వద్ద డీజిల్ కొనేందుకు సరిపడా డబ్బు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆ బస్సుకు చెందిన డిపోదే.'' అని కాసర్‌గోడ్ జిల్లా రవాణా అధికారి రాయ్ జాకబ్ చెప్పారు. పయ్యన్నూరు డిపోలో 6,000 లీటర్ల డీజిల్‌, కన్నూర్‌ డిపోలో 6,200 లీటర్ల డీజిల్‌ ఉంది.. కానీ అక్కడ డీజిల్ నింపించుకోకుండా.. ఖాళీ ట్యాంక్‌తో ఇక్కడకు వచ్చారని విమర్శించారు. కాసర్‌గోడ్‌లోని ప్రైవేట్ ఇంధన కేంద్రాలు కాసర్‌గోడ్ డిపోకు డీజిల్ సరఫరాను నిలిపివేసాయని.. తద్వారా తామూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాసర్‌గఢ్‌లో ప్రైవేట్ ఇంధన కేంద్రాలు ఆర్టీసీకి డీజిల్ నిలిపివేయడంతో... బస్సులు తమ టిక్కెట్ కలెక్షన్‌లో నుంచే డీజిల్‌ను కొనుగోలు చేస్తాయి. ఈ డిపోకు ప్రతిరోజూ దాదాపు రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం లభిస్తుండగా... అందులో రూ.3 లక్షలు ఇంధనానికే ఖర్చవుతోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karnataka, National, National News, Trending

  ఉత్తమ కథలు