హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Krafton: BGMIపై సంచలన నిర్ణయం.. మొబైల్ గేమ్ నిషేధంపై కంపెనీ రియాక్షన్ ఇదే..!

Krafton: BGMIపై సంచలన నిర్ణయం.. మొబైల్ గేమ్ నిషేధంపై కంపెనీ రియాక్షన్ ఇదే..!

BGMIపై సంచలన నిర్ణయం..

BGMIపై సంచలన నిర్ణయం..

బీజీఎంఐ (BGMI) గేమ్ బ్యాన్‌పై స్పందించింది బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ డెవలపర్ క్రాఫ్టన్. దేశంలో 10 కోట్లకు పైగా వినియోగదారులతో అత్యంత ప్రజాదరణ పొందిన బాటిల్ రాయల్ గేమ్‌పై నిషేధం విషయంలో భారత (Indian) అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిపారు క్రాఫ్టన్ CFO బే డాంగ్ గెన్.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో మొబైల్ గేమ్ మార్కెట్‌ను ఎలాగైనా లీడ్ చేయాలని చూసిన క్రాఫ్టన్ (Krafton) కంపెనీకి ఎదురుదెబ్బలు తప్పట్లేదు. పబ్జీ గేమ్‌ను నిషేధించిన తర్వాత ఈ సంస్థ డెవలప్ చేసిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)ను భారత ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేసింది. ఐటీ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ అంశంపై స్పందించింది బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ డెవలపర్ క్రాఫ్టన్. దేశంలో 10 కోట్లకు పైగా వినియోగదారులతో అత్యంత ప్రజాదరణ పొందిన బాటిల్ రాయల్ గేమ్‌పై నిషేధం విషయంలో భారత అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిపారు క్రాఫ్టన్ CFO బే డాంగ్ గెన్.

కంపెనీ త్రైమాసిక సమావేశాల సందర్భంగా గెన్ మాట్లాడారు. భారత ప్రభుత్వ ఆందోళనను క్రాఫ్టన్ గౌరవిస్తుందని, అర్థం చేసుకుంటుందని చెప్పారు. “కఠినమైన డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్, మానిటరింగ్ ఆధారంగా నేరుగా సేవలను నడుపుతున్నాం. ఇండియన్ యూజర్లు BGMIని ఆస్వాదించడానికి మార్గాలను కనుగొనేందుకు అధికారులతో సంప్రదింపులు జరపడంతో పాటు వారికి సహకరిస్తాం’ అని డాంగ్-గెన్ చెప్పారు.

ఇదీ చదవండి: వన్‌ప్లస్ కళ్లు చెదిరే ఫోన్.. ఫీచర్స్ చూస్తే కొనేస్తారు అంతే..!


BGMIని నిషేధించాలని ఇటీవల గూగుల్, యాపిల్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ డీ-లింక్ అయింది. ఆ తర్వాత ఈ విషయంపై కొన్ని గేమింగ్ కంపెనీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. దేశంలో గేమింగ్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడానికి పారదర్శక విధానం ఉండాలని అందులో అభ్యర్థించాయి.

‘రెండో త్రైమాసికంలో స్థానిక మార్కెట్‌లో సొంత, ఆఫ్‌లైన్ కొలాబరేషన్స్‌ ద్వారా కస్టమర్ బేస్‌ను విస్తరించాం. మానిటైజ్డ్ కంటెంట్ ఆఫర్లతో BGMIకి యూనిక్ బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియన్స్ అందించాం’ అని డాంగ్ గెన్ తెలిపారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రాఫ్టన్ ఆదాయం $727.7 మిలియన్లకు, నికర ఆదాయం $337.6 మిలియన్లకు పెరిగింది.

గత నెల చివర్లో BGMI గేమింగ్ యాప్‌ను సంబంధిత ఆన్‌లైన్ స్టోర్స్ నుంచి బ్లాక్ చేయమని ప్రభుత్వం గూగుల్, యాపిల్ కంపెనీలను ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో భద్రతాపరమైన ఆందోళనలు, యూజర్ల డేటా చైనాకు వెళ్లడం వంటి కారణాలతో PUBG మొబైల్ గేమ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో ఈ గేమ్‌కు ఇండియన్ వెర్షన్‌గా BGMIను క్రాఫ్టన్ కంపెనీ డెవలప్ చేసింది. బీజీఎంఐ మొబైల్ గేమ్‌ను దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీ అందిస్తున్నప్పటికీ, చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీకి దీనిలో వాటాలు ఉన్నాయి. దీంతో చైనా కనెక్షన్ ఉన్న ఈ గేమ్‌ను కూడా కేంద్రం బ్యాన్ చేసింది.

First published:

Tags: Battlegrounds Mobile India, BGMI, Mobile game, PUBG

ఉత్తమ కథలు