అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి.. సుప్రీం కోర్టును కోరిన బాధితురాలు..

రాబిన్

అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

 • Share this:
  అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసి, ఓ బిడ్డ పుట్టడానికి కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరింది. త్వరలో పాఠశాలలో చేరబోతున్న ఒక బిడ్డకు అవివాహిత తల్లి అనే కళంకానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టుగా బాధితురాలి తరఫున ఆమె న్యాయవాది అలెక్స్ జోసెఫ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాలు.. మాజీ కేథలిక్ ప్రీస్ట్ రాబిన్ వడ‌క్కుం చెర్రి.. కొట్టియూర్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్బవతిని చేశాడు. 2016 లో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పుడు బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ రాబిన్.. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దంటూ హెచ్చరించాడు. దీంతో భయపడిన బాలిక ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అయితే 2017 ఫిబ్రవరిలో బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

  దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూత్తుపరంబలోని క్రీస్తు రాజా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె గర్భవతి అని అప్పుడు తెలిసింది. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు రాబిన్‌ను కొచ్చిలో అరెస్టు చేశారు. తొలుత ఈ కేసుతో తనకు సంబంధం లేదని రాబిన్ చెప్పుకొచ్చాడు.. కానీ డీఎన్‌ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 2019లో రాబిన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్.. తాను బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఇందుకోసం తనకు రెండు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే 2021 ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే తాజాగా బాధితురాలు.. రాబిన్‌ను వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇది తాను స్వంతంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పింది. అతడిని బెయిల్ మంజూరు చేయాలని కోరింది. కాగా, ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
  Published by:Sumanth Kanukula
  First published: