• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • KOLKATA TEEN CYCLES 120 KM DAILY TO SELL SWEETS AS LOCAL TRAINS REMAIN SHUT IN PANDEMIC DETAILS HERE MS

Inspiring Story: బతుకుపోరులో రోజుకు 120 కిలోమీటర్లు సైకిల్ మీదే ప్రయాణం... స్పూర్తినిస్తున్న బెంగాల్ కుర్రాడు

Inspiring Story: బతుకుపోరులో రోజుకు 120 కిలోమీటర్లు సైకిల్ మీదే ప్రయాణం... స్పూర్తినిస్తున్న బెంగాల్ కుర్రాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు చేసుకునే వారిని ఆ వైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. వైరస్ వ్యాప్తికి భయపడి ప్రభుత్వాలు సైతం లాక్డౌన్ ను పెట్టక తప్పని పరిస్థితి. కానీ ఈ సంక్షోభంలోనూ ఒక కుర్రాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నాడు. అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు.

  • News18
  • Last Updated:
  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. లాక్డౌన్ విధింపుతో ప్రజారవాణా స్థంబించింది. దీంతో చిరువ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి వారిలో ఇమ్రాన్ షేక్ అనే 19 ఏళ్ల యువకుడు ఒకడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 120 కిలోమీటర్ల దూరం ఉన్న నాడియా జిల్లాకు చెందిన ఇమ్రాన్ షేక్ తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు స్వీట్లు అమ్మేవాడు. దీనికి గాను ఆ యువకుడు ప్రతి రోజు లోకల్ ట్రైన్ లో వెళ్లేవాడు. అయితే దేశంలో కోవిడ్–19 విజృంభణతో భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. తద్వారా కోల్కతాలో లోకల్ ట్రైన్స్ స్థంబించిపోయాయి. దీంతో తన కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తానే స్వయంగా సైకిల్ పై కోల్‌కతాకు ప్రయాణించి స్వీట్లను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

    దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియను ప్రారంభించింది. క్రమంగా వ్యాపారాలు పునరుద్ధరిస్తూ వస్తోంది.  అయితే లోకల్ గా నడిచే రైళ్లు.. అంతర్రాష్టాల మధ్య తిరిగే రైళ్లను పూర్తి  స్థాయిలో పునరుద్దరించలేదు. దీంతో అన్లాక్ 1.0 ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి ఇమ్రాన్ షేక్ తన సైకిల్ పై ప్రతిరోజూ సైకిల్ తొక్కుతూ 120 కిలో మీటర్లు ప్రయాణిస్తూ స్వీట్లు అమ్ముతున్నాడు. కోల్‌కతా నగరానికి వెళ్లి రావడానికి ఇమ్రాన్ తన సైకిల్‌పై ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రయాణం చేస్తున్నాడు. కాగా, ఇమ్రాన్ స్వస్థలం నాడియా స్వీట్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇమ్రాన్ తల్లిదండ్రులు కూడా స్వీట్లు తయారీచేస్తారు.

    ప్రతిరోజు 7 గంటల ప్రయాణం..
    స్థానికంగా తయారు చేసే స్వీట్లకు కోలకతాలో మంచి గిరాకీ ఉండటంతో ఇమ్రాన్ స్థానిక తయారీదారులతో ఒప్పందం చేసుకున్నాడు. మార్కెట్ ధరతో పోల్చితే తక్కువ ధరకే ఇమ్రాన్ స్వీట్లను విక్రయిస్తున్నాడు. ఒక్కో స్వీట్ ను కేవలం రూ.5 రూపాలయకే అమ్ముతున్నాడు. వాటిని డబ్బాల లోపల పెట్టి తెల్లవారుజామున 3 గంటలకే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. కోల్‌కతా నగరంలోనే కాకుండా మార్గమధ్యంలో ఉన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా స్వీట్లు విక్రయిస్తూ చివరకు ఉదయం సుమారు 8 గంటల వరకు కోల్‌కతాకు చేరుకుంటాడు.

    అమ్మకాలు పెరిగాయి..

    కాగా, ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు తొలి రోజుల్లో రోజుకు 300 స్వీట్లు మాత్రమే అమ్మేవాడు. తక్కువ ధరకే నాణ్యమైన స్వీట్లు అందజేస్తుండటంతో అతడు అమ్మే స్వీట్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో ప్రస్తుతం తాను ప్రతిరోజు సుమారు 700 స్వీట్లు అమ్ముతుగలుగుతున్నాడు. ఇమ్రాన్ విక్రయించే స్వీట్లలో రసగుల్లాలు, గులాబ్ జాములు, లాంగ్చా, డ్రైఫ్రూట్స్ వంటివి ఉన్నాయి.

    కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 25 నుండి లాక్డౌన్ అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా సేవలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రయాణాలకు చాలా తమ స్వంత వాహనాలను లేదా ప్రైవేట్ వాహనాలను ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో ఇమ్రాన్లాంటి చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవలే అన్లాక్ ప్రక్రియల్లో భాగంగా క్రమక్రమంగా ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు