మార్కెట్లో తక్కువ ధరకే మటన్.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

మాంసం జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి.

ఎట్టకేలకు దిగొచ్చిన మటన్ వ్యాపారులు స్థానికులతో చర్చలు జరిపి.. మటన్ ధరలను తగ్గించారు. ప్రస్తుతం కిలో మటన్ ధరను రూ.480గా ఖరారు చేశారు.

 • Share this:
  దేశంలో ఇప్పటికే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. డబుల్ సెంచరీ (రూ.200) వైపు పరుగులు పెడుతూ సామాన్యుడికి అందకుండా పోతోంది. ఉల్లి బాధలను మరవక ముందే చాలా ప్రాంతాల్లో మటన్ రేట్లు కూడా పెరిగాయి. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ.600-650 వరకు పలుకుతోంది. ఐతే ఈ ప్రాంతంలో మాత్రం కేవలం రూ.450కే లభిస్తోంది. ఎక్కడ? ఎందుకో తెలుసా..?

  మహారాష్ట్రలో కొల్హాపూర్‌లో మటన్ ధరలు భగ్గుమంటున్నాయి. కిలో మటన్ దాదాపు రూ.700లు పలుకుతోంది. ఈ రేట్లను చూసి సామాన్యులు షాక్ తింటున్నారు. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడుతున్నామని.. మటన్ ధరలు కూడా పెరిగితే మాంసాహారానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో వినూత్న నిరసనకు దిగారు కొల్హాపూర్ వాసులు. తామే స్వయంగా మేకలు కోసి.. మార్కెట్లో తక్కువ ధరకే మటన్ అమ్ముతున్నారు. కిలో మటన్‌ను రూ.400-450కే అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు.

  ఈ విషయంలో స్థానికులంతా ఒకే తాటిపై ఉన్నారు. రెండు మూడు రోజుల పాటు ఇలాగే అమ్మకాలు సాగించడంతో మటన్ వ్యాపారులకు గిరాకీ తక్కువయింది. దాంతో ఎట్టకేలకు దిగొచ్చి స్థానికులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం మటన్ ధరలను కిలోకు రూ.200 మేర తగ్గించారు. ప్రస్తుతం కొల్హాపూర్‌లో కిలో మటన్ ధరను రూ.480గా ఖరారు చేశారు. కాగా, దేశంలో ఇలా నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటి సారి.
  Published by:Shiva Kumar Addula
  First published: