ఇద్దరబ్బాయిల పెళ్లి.. కొడవ సంప్రదాయంలో వేడుక.. కర్నాటకలో తీవ్ర దుమారం

కొడవలు..కర్నాటకలోని కొడగు జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీరి జనాభా 3 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మూడో వంతు కొడవ జనాభా ఒక్క కొడగులోనే ఉంది.

news18-telugu
Updated: October 9, 2020, 9:13 AM IST
ఇద్దరబ్బాయిల పెళ్లి.. కొడవ సంప్రదాయంలో వేడుక.. కర్నాటకలో తీవ్ర దుమారం
శరత్, సందీప్ వివాహం
  • Share this:
(DP Satish, News18)

కర్నాటకలో ఓ వివాహ వేడుకపై తీవ్ర దుమారం రేగుతోంది. కొడవ సంప్రదాయం ప్రకారం ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడాన్ని ఆ సామాజిక వర్గ ప్రజలు తప్పుబట్టుతున్నారు. ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని.. స్వలింగ వివాహంతో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్ పొన్నప్ప కాలిఫొర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన శరత్‌కు సందీప్ దోసంజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. సందీప్ దోసంజ్ ఉత్తర భారతీయుడు. కొన్నేళ్ల క్రితం యూఎస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు.. సెప్టెంబరు 26న ఒక్కటయ్యారు. అమెరికా కాలిఫొర్నియాలోని ఓ రిసార్ట్‌లో కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. కొడవ సంప్రదాయ దుస్తులను ధరించి వీరిద్దరు స్వలింగ వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరకు వీరి పెళ్లి విషయం కర్నాటకలోని కొడవ సామాజిక వర్గం ప్రజలకు తెలిసింది. స్వలింగ వివాహం తమ సంప్రదాయాలకు విరుద్ధమని..పైగా కొడవ సంప్రదాయ దుస్తుల్లో వివాహం జరిపించడమేంటని మండిపడుతున్నారు.

''గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇది మా సంప్రదాయాలు, విశ్వాసాలకు అవమానం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. గే మ్యారేజ్ చేసుకోవడమే మా సంప్రదాయానికి విరుద్ధం. అలాంటిది కొడవ సంప్రదాయ దుస్తుల్లో వివాహం చేసుకోవడం ఇంకా దారుణం. ఇంతటి నీచమైన పనిచేసినందుకు శరత్ పొనప్పను కొడవ సామాజిక వర్గం నుంచి బహిష్కరిస్తాం.'' అని మడికెరి కొడవ సమాజ అధ్యక్షుడు కేఎస్ దేవయ్య తెలిపారు.

ఐతే కొడవ సామాజికవర్గం పెద్దల విమర్శలపై స్పదించేందుకు ప్రయత్నించగా.. శరత్ పొన్నప్ప అందుబాటులోకి రాలేదు. దీనిపై స్పందించేందుకు దుబాయ్‌లో నివసించే వారి తల్లిదండ్రులు నిరాకరించారు.

కొడవలు..కర్నాటకలోని కొడగు జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీరి జనాభా 3 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మూడో వంతు కొడవ జనాభా ఒక్క కొడగులోనే ఉంది. కొడవలు ఎక్కువగా ఉండే కొడగు జిల్లాలో దట్టమైన అడవులు, పర్వతాలు, జలపాతాలు, నదులు, ప్రవాహాల ఉంటాయి. వీరు ఎక్కువ కాఫీ తోటలను సాగు చేస్తుంటారు. కర్నాటకలో ఎంతో కీలకమైన కావేరి నది కూడా కొడుగు జిల్లాలోనే ప్రారంభమవుతుంది. అందుకే కావేరి నదిని ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్కడి ప్రజలు.

కొడవ ప్రజలకు ప్రత్యేకమైన సంప్రదాయ వేషధారణ ఉంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆ దుస్తులను ధరిస్తారు. కొడవేతరులు అలాంటి దుస్తులను ధరించడం వీరికి ఇష్టం ఉండదు. గత ఏడాది కొడగులో ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో పనిచేసే సిబ్బంది.. కొడవ వస్త్రధారణలో అతిథులకు సేవలందించడంపై తీవ్ర దుమారం రేగింది. ఐతే తమ తప్పును తెలుసుకున్న రిసార్ట్ యాజమాన్యం కొడవ కమ్యూనిటీకి క్షమాపణలు తెలిపింది. తాజాగా ఈ స్వలింగ వివాహంపై కొడగు జిల్లాలో కొడవ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading