కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్... నిజమెంత ?

అయితే ఈ వార్తల్లో వాస్తవమెంతా ? నిజంగా అంత పెద్ద న్యూక్లియర్ కేంద్రంపై సైబర్ దాడి జరిగిందా? పవర్ ప్లాంట్ అధికారులు ఏమన్నారంటే ?

news18-telugu
Updated: October 29, 2019, 12:58 PM IST
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్... నిజమెంత ?
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం
  • Share this:
తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్ జరిగిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో కూడా దీనిపై అనేక మంది వార్తలు ఇచ్చారు. దీంతో అటు తమిళనాడు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అయితే ఈ వార్తల్లో వాస్తవమెంతా ? నిజంగా అంత పెద్ద న్యూక్లియర్ కేంద్రంపై సైబర్ దాడి జరిగిందా అంటే? అదంతా అవాస్తవమని కూండంకుళం న్యూక్లియర పవన్ ప్రాజెక్టు అధికారులు కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలు అటూ KKNPP ట్రైనింగ్ సూపరెండెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్. రామ్‌దాస్ ఖండించారు.

కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు (కెకెఎన్‌పిపి) మరియు ఇతర భారతీయ అణు విద్యుత్ ప్లాంట్ల నియంత్రణ వ్యవస్థలు స్వతంత్రంగా ఉన్నాయన్నారు. వాటిని బయటి సైబర్ నెట్‌వర్క్ మరియు ఇంటర్నెట్‌కు అనుసంధానించబడలేదని స్పష్టం చేశారు రామ్‌దాస్. అణు విద్యుత్ ప్లాంట్ నియంత్రణ వ్యవస్థపై సైబర్ దాడి సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం, KKNPP యూనిట్ -1 & 2 ఎటువంటి కార్యాచరణ, భద్రతా సమస్యలు లేకుండా వరుసగా 1000 MWe మరియు 600 MWe వద్ద పనిచేస్తున్నాయన్నారు.
First published: October 29, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading