హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అర్ధరాత్రి అనుమతి: ఢిల్లీలో ముగిసిన కిసాన్ క్రాంతి పాదయాత్ర

అర్ధరాత్రి అనుమతి: ఢిల్లీలో ముగిసిన కిసాన్ క్రాంతి పాదయాత్ర

మంగళవారం అర్ధరాత్రి తర్వాత రైతులను ఢిల్లీ నగరంలోకి పోలీసులు అనుమతించారు. దీంతో అన్నదాతలు కిసాన్ ఘాట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం యాత్రను ముగించారు.

  ఢిల్లీలో సంచలనం సృష్టించిన కిసాన్ క్రాంతి పాదయాత్ర ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత రైతులను పోలీసులు నగరంలోకి అనుమతించడంతో వారు కిసాన్ ఘాట్ వరకు యాత్ర చేశారు. మాజీ ప్రధాని చౌదురి చరణ్ సింగ్ స్మృతి స్థలం ‘కిసాన్ ఘాట్‌’లో యాత్రను ముగించారు. వరి, మొక్కజొన్న, చెరకు పంటకు కనీస మద్ధతు ధర, రైతు రుణాల మాఫీ, కరెంటు చార్జీల తగ్గింపు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, పదేళ్లు దాటిన ట్రాక్టర్ల మీద నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 23న భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహార్యాలీ ప్రారంభించారు.

  ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు చెందిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. అయితే, ఢిల్లీ నగరంలోకి అన్నదాతల ర్యాలీని పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో పోలీసులు, రైతుల మధ్య ఓ యుద్ధం జరిగింది. రైతుల మీద పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లను పేల్చారు. లాఠీచార్జీ చేయడంతో పలువురు అన్నదాతలు గాయపడ్డారు. అయితే, అర్ధరాత్రి తర్వాత రైతులను నగరంలోకి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రైతులు కిసాన్ ఘాట్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు.

  ‘మేం కిసాన్ ఘాట్ వరకు యాత్ర చేయాలనుకున్నాం. ఢిల్లీ పోలీసులు మమ్మల్ని నగరంలోకి అనుమతించలేదు. దీంతో మేం ఆందోళన చేశాం. మా ఉద్దేశం యాత్రను పూర్తిచేయడం. అది ఇప్పుడు పూర్తయింది. ఇక అందరం మా గ్రామాలకు వెళ్లిపోతాం.’ అని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ తికాయత్ తెలిపారు.

  అన్నదాతల మీద పోలీసులు కాఠిన్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, కనీసం వారి ర్యాలీకి కూడా అనుమతివ్వకపోవడం దారుణమని విపక్షాలు మండిపడ్డాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజ్ నాథ్, వ్యవసాయ శాఖ సహాయమంత్రి.. రైతు నాయకులతో మాట్లాడారు. ఆందోళనను విరమించాల్సిందిగా సూచించారు.

  First published:

  Tags: Farmers Protest

  ఉత్తమ కథలు