NASA Sun :మన దేశంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ IPS ఆఫీసర్, సోషల్ యాక్టివిస్ట్, మాజీ టెన్నిస్ ప్లేయర్ అయిన కిరణ్ బేడీకి ఎంతో మంచి పేరుంది. తాజాగా ఆమె తన పేరును స్వయంగా దిగజార్చుకుంటున్నారు. నెటిజన్ల ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. కారణం ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో. ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండుల్కర్ తదితరులు... సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల్ని, ట్వీటుల్నీ రీపోస్ట్, రీట్వీట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో వాటిలో నిజానిజాల్ని వారు తెలుసుకోరు. అప్పటికప్పుడు షేర్ చేశామా... స్పందించామా అన్నట్లు లైట్ తీసుకుంటారు. కానీ ఇలాంటి చాలా ఫేక్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కిరణ్ బేడీ కూడా ఇలాంటి ఉచ్చులో చిక్కుకున్నారు. ట్విట్టర్లో ఓ నకిలీ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. సూర్యుడి నుంచీ ఓం అనే శబ్దం వస్తుండటాన్ని నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) రికార్డ్ చేసిన వీడియో అని దానికి కాప్షన్ పెట్టారు. ఆ వీడియో ఇదే...
ఇదో నకిలీ వీడియో. ఈ విషయం కిరణ్ బేడీకి తప్ప... చాలా మంది నెటిజన్లకు తెలుసు. అసలు ఈ వీడియో ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిరణ్ బేడీ ఇప్పుడు చూశారు. ఈ వీడియోని పెట్టినందుకు నెటిజన్లు కిరణ్ బేడీపై సీరియస్ అవుతున్నారు. మీలాంటి వాళ్లు కూడా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే... నాసా ఇదే అంశానికి సంబంధించి ఇదివరకే యూట్యూబ్‌లో రియల్ వీడియోని పెట్టింది. అందులో సూర్యుడి నుంచీ వచ్చే శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి హోరు గాలిలా, మంట శబ్దాల్లా వినిపిస్తున్నాయి. మొత్తం 40 రోజులు రికార్డ్ చేసి... ఈ ధ్వనులను నాసా సేకరించింది. ఆ వీడియో ఇదీ...
ఈ విషయంలో కిరణ్ బేడీని తప్పు పట్టాల్సిన పని లేదు. ఆమె కూడా నకిలీ వీడియోల ఉచ్చులో పడ్డారంతే. ఓం అనే శబ్దం వినిపిస్తుందనేసరికి... ఆమె ఎక్సైట్మెంట్ ఫీలై... షేర్ చేసేశారనుకోవచ్చు. నకిలీ వీడియోలు, నకిలీ కంటెంట్... అంతలా జనాన్ని మోసం చేస్తున్నాయన్నమాట.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.