Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Khushbu Sundar: బీజేపీలో చేరిన ఖుష్బూ... ఇక తమిళ రాజకీయాల్లో దూకుడే...

    Khushbu Sundar Joins BJP: ఇప్పటివరకూ తమిళ రాజకీయాల్లో పెద్దగా కదలికలు లేవు. కానీ సడెన్ గా ఖుష్బూ బీజేపీ గూటికి వెళ్లడంతో... సమీకరణలు మారాయి. నెక్ట్స్ పిక్చర్ ఎలా ఉండబోతోంది?

    news18-telugu
    Updated: October 12, 2020, 1:53 PM IST
    Khushbu Sundar: బీజేపీలో చేరిన ఖుష్బూ... ఇక తమిళ రాజకీయాల్లో దూకుడే...
    బీజేపీలో చేరిన ఖుష్బూ సుందర్
    • Share this:
    Khushbu Sundar Joins BJP: సినీ నటి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఖుష్బూ సుందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ ఊహించినట్లే... ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపిన ఖుష్బూ... కొన్ని గంటల తర్వాత... బీజేపీ ఆఫీసుకు వెళ్లి... ఆ పార్టీలో చేరిపోయారు. సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసిన కుష్బూ కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈమధ్య కేంద్రం తెచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కుష్బూపై సీరియస్ అయ్యింది. అప్పటి నుంచే కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ వార్తలను ఆమె ఖండించలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా, కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన కుష్బూ మధ్యాహ్నం బీజేపీలో చేరారు.

    బీజేపీలో చేరిన ఖుష్బూ


    తమిళనాడులో దూకుడే:
    కుష్బూ రాకతో తమిళనాడు బీజేపీకి కొత్త గ్లామర్ వచ్చినట్టే అని చెప్పాలి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కుష్బూ చేరికతో బీజేపీకి కొంతమేర అదనపు బలం పెరుగుతుందని చెప్పొచ్చు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉంది అన్నాడీఎంకే. మరోవైపు ఈసారి ఎలాగైనా గెలవాలని డీఎంకే కృతనిశ్చయంతో ఉంది. డీఎంకే, కాంగ్రెస్ కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ కలసి బరిలోకి దిగే చాన్స్ ఉంది. తమిళనాట రాజకీయాలకు, సినీ గ్లామర్‌కు ఉన్న సంబంధం తెలిసిందే. రాజకీయాల్లోనూ సినిమా వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో తమిళనాట బీజేపీకి సినీ గ్లామర్ అందించడం కోసం ఖుష్బూను కమలం వైపు తీసుకొచ్చేందుకు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ విషయంలో బీజేపీ విజయం సాధించింది.

    Khushbu Sundar, Khushbu sundar joins BJP, Khushbu Sundar quits congress, Khushbu Sundar congress, Khushbu Sundar BJP, Khushbu Sundar joined BJP, Khushbu Sundar news, Tamil Nadu assembly election, Tamil Nadu polls, L Murugan, ఖుష్బూ, బీజేపీలో చేరిన ఖుష్బూ,
    ఖుష్బూ సుందర్ (File)


    వీరాభిమానం:
    తమిళనాట ఖుష్బూకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలంటే ఓ ఉదాహరణ గురించి చెప్పాలి. ఖుష్బూ సుందర్ మీద అభిమానంతో ఆమెకు గుడి కూడా కట్టారు అభిమానులు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఖుష్బూను బీజేపీలో చేర్చుకుంటే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని కమలం పార్టీ లెక్కలేసుకుంది. అయితే, ఖుష్బూ సుందర్ పూర్తి తమిళవాది. హిందీని బలవంతంగా రుద్దే అంశానికి ఆమె వ్యతిరేకి. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదని ఆమె చాలా సార్లు స్పష్టం చేశారు. ప్రాంతీయ సినిమాల మీద వివక్ష చూపుతున్నారంటూ కూడా మండిపడ్డారు. అలాగే జల్లికట్టు ఉద్యమానికి కూడా ఆమె మద్దతు పలికారు.

    1986లో కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బూ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత 2010లో డీఎంకేలో చేరారు. అప్పటి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో డీఎంకేను వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో చేరారు.
    Published by: Krishna Kumar N
    First published: October 12, 2020, 1:53 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading