హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress President: 26న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Congress President: 26న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

మల్లికార్జున ఖర్గే, మోడీ (ఫైల్ ఫోటో)

మల్లికార్జున ఖర్గే, మోడీ (ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ అధ్యక్షునిగా మల్లికార్జున ఎన్నికపై ప్రధాని మోడీ (Narendra modi) ట్వీట్ చేశారు. మల్లిఖార్జున ఖర్గేకు  (Mallikharjuna Kharge) శుభాకాంక్షలు. ఆయన పదవి కాలం ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏఐసీసీ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) విజయం సాధించారు. నేడు కౌంటింగ్ అనంతరం వెలువడిన ఫలితాల్లో మల్లికార్జున ఖర్గేకు 7897 ఓట్లు రాగా శశిథరూర్ (Shashi tharoor) కు 1072 ఓట్లు వచ్చాయి. దీనితో  మల్లికార్జున ఖర్గే  (Mallikharjuna Kharge) 6800పై ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం ఓట్లలో 415 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే  (Mallikharjuna Kharge) వ్యవహరించబోతున్నారు. ఈనెల 26న ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షునిగా మల్లికార్జున ఎన్నికపై ప్రధాని మోడీ (Narendra modi) ట్వీట్ చేశారు. మల్లిఖార్జున ఖర్గేకు  (Mallikharjuna Kharge) శుభాకాంక్షలు. ఆయన పదవి కాలం ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

అయితే ఏఐసీసీ ఎన్నికలకు మొదటి నుంచి మల్లికార్జున  (Mallikharjuna Kharge) పేరు వినపడలేదు. రేసులో ప్రధాన అభ్యర్థిగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లూత్ పేరు వినిపించగా ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. ఇక నేను పోటీలో ఉన్నా అంటూ ముందుకొచ్చిన మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పోటీ చేయడం లేదని చేతులెత్తేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంకెవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  అయితే కాంగ్రెస్ ప్రెసిండేట్ పోటీకి శశిథరూర్  (Shashi tharoor) పేరు మొదటి నుంచి వినిపించింది. ఆ తరువాత మల్లిఖార్జున  (Mallikharjuna Kharge) పేరు ఖరారు అయింది. దీనితో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ద్విముఖ పోరు నెలకొంది.

Big Breaking: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే భారీ విజయం

ఎన్నికలు లేకుండా చేయాలని:

అయితే ఈ ఇద్దరిలో ఎక్కువ మంది మల్లికార్జున ఖర్గేకు  (Mallikharjuna Kharge) మద్దతు తెలిపారు. అంతేకాదు శశిథరూర్ పోటీ నుండి తప్పుకోవాలని మూకుమ్మడిగా ఖర్గేను  (Mallikharjuna Kharge) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని భావించారు. కానీ శశిథరూర్  (Shashi tharoor) మాత్రం వెనకడుగు వేయలేదు. దీనితో ఎన్నికలు తప్పలేదు.

ఖర్గే విజయానికి కారణం:

మల్లికార్జున ఖర్గే  (Mallikharjuna Kharge) దళిత వర్గానికి చెందిన నేత. అలాగే క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి కావాల్సిన అనుభవం ఆయనకు ఉంది. ఇక శశిథరూర్  (Shashi tharoor) ఉన్నతవర్గానికి చెందిన వ్యక్తి. మంచి వ్యక్తి, ఆలోచనలు బాగున్నప్పటికీ ఒకానొక సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇది శశిథరూర్  (Shashi tharoor) కు ప్రతికూలంగా మారింది.

First published:

Tags: India, Mallikarjun Kharge, Narendra modi

ఉత్తమ కథలు