• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • KHALISTAN SUPPORTERS WANTED TO TURN JAN 26 AS JALLIANWALA BAGH 2 SAYS FORMER DGP BA

‘రిపబ్లిక్ డే వేడుకలను జలియన్ వాలాబాగ్ 2.0 గా మార్చాలనుకున్న ఖలిస్తాన్ మద్దతుదారులు’

‘రిపబ్లిక్ డే వేడుకలను జలియన్ వాలాబాగ్ 2.0 గా మార్చాలనుకున్న ఖలిస్తాన్ మద్దతుదారులు’

ఢిల్లీలో ఎర్రకోట వద్ద రైతులు (File)

రిపబ్లిక్ డే వేళ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా సాగింది. అయితే, ఈ ఘటన భద్రతా దళాలు, ఢిల్లీ పోలీసుల కళ్లు తెరిపించింది. ఏదైనా సమూహానికి సరైన కమాండ్ లేకపోతే, వారి ఆందోళన హింసకు దారితీసే అవకాశం ఉందని గుర్తించారు.

 • Share this:
  (విక్రమ్ సింగ్, CNNNews18 కోసం రాసిన వ్యాసం)

  రిపబ్లిక్ డే వేళ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా సాగింది. అయితే, ఈ ఘటన భద్రతా దళాలు, ఢిల్లీ పోలీసుల కళ్లు తెరిపించింది. ఏదైనా సమూహానికి సరైన కమాండ్ లేకపోతే, వారి ఆందోళన హింసకు దారితీసే అవకాశం ఉందని గుర్తించారు. ఇక్కడ మాత్రం కొందరు నేతల రాజకీయ లాభం కోసం చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. మంగళవారం జరిగిన ఆందోళనలను ఓ సారి గమనించాలి. గతంలో నిరసన ప్రదేశాల్లో ఉమర్ ఖలీద్, ఇతరుల పోస్టర్లు కనిపించిన విషయం గుర్తించాలి. నాకో విషయం అర్థం కావడం లేదు. అసలు ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదు?. సీఆర్పీసీ సెక్షన్ 107, సెక్షన్ 116(3) ప్రకారం గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఢిల్లీలోపలికి నిరసనకారులను అనుమతిస్తే హింస జరిగే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఢిల్లీ పోలీసులు 37 పాయింట్ డైరెక్టివ్‌ను జనవరి 25వ తేదీన అమలు చేశారు. నిరసన అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అంత తక్కువ సమయంలో దాన్ని అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? ర్యాలీలు పక్కన పోలీసు వాలంటీర్లు కూడా ఎస్కార్టుగా రావాల్సింది. అప్పుడు కొన్ని యూనియన్లు చెప్పినట్టు రైతులు దారితప్పేవారు కాదు. ఏం చేయాలి? ఎలా చేయాలనే FAQలు రెడీగా పెట్టుకోవాల్సింది. ఎర్రకోటను కంటోన్మెంట్‌గా మార్చాల్సింది. కానీ, ఇప్పుడు జరిగింది ఓ మేలుకొలుపు.

  మరో జలియన్ వాలాబాగ్ కాదు
  ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను అభినందిస్తున్నారు. వారు నిరసనకారుల మీద లెథల్ వెపన్స్ వాడకుండా సద్దుమణిగేలా చేయగలిగారు. ఒకవేళ అదే జరిగితే, అది కొన్ని దశాబ్దాల పాటు చర్చనీయాంశంగా మారేది. విమర్శలకు గురయ్యేది. ఇలా జరగాలని పాకిస్తాన్, ఖలీస్తానీ మద్దతుదారుల ఉద్దేశం. వాళ్లు జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలను మరో జలియన్ వాలాబాగ్‌గా మార్చాలని భావించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను మరో జనరల్ డయ్యర్‌ను చెయ్యాలనుకున్నారు. వాళ్ల ట్రాప్‌లో పడకుండా తెలివిగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులు శెభాష్. ఢిల్లీ పోలీసులు ఫైరింగ్ చేయకుండా హుందాగా వ్యవహరించారు. ఇక్కడ మహిళా పోలీసులను కూడా అభినందించారు. హింసాత్మక ప్రాంతాల్లో కూడా వారు ధైర్యసాహసాలు ప్రదర్శించి విధులు నిర్వర్తించారు.

  ఇంకా ముందుంది?
  నాకు తెలిసి ఢిల్లీ హింసకు సంబంధించి 22 కేసులు నమోదు చేసినట్టున్నారు. క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. విచారణకు కావాల్సిన అన్ని సాంకేతిక సాయం తీసుకోవాలి. హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ముఖాలను గుర్తించే సాఫ్ట్ వేర్, బిగ్ డేటా ఎనలటిక్స్ సాఫ్ట్ వేర్, సీసీటీవీ వీడియోలు చూడాలి. వారి వివరాలు చెప్పిన వారికి పట్టుకున్న వారికి భారీగా నగదు బహుమతులు ప్రకటించాలి. ఇండియా మోస్ట్ వాంటెడ్ నేరస్తులుగా భావించి వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. దోషులకు గుణపాఠం నేర్పాలి. రిపబ్లిక్ డే, తిరంగా గౌరవం విషయంలో రాజీపడకూడదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన లఖా సిధానా, దీప్ సిద్ధులను MCOCA చట్టం కింద బుక్ చేయాలి. వారి స్థిర, చరాస్తులను జప్తు చేయాలి. రాజకీయ పార్టీలతో మిలాఖత్ అయినంత మాత్రాన క్రిమినల్స్‌ తప్పించుకోలేరు.

  ఇక పరిపాలన విభాగం దీని గురించి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, ముందస్తు అరెస్టులు చేయడం. ఇంటెలిజెన్స్ బలోపేతం చేయడం, ఆ సమాచారం ఆధారంగా సరైన సమయంలో యాక్షన్ తీసుకోవడం. నిరసన ర్యాలీలు చేపట్టేటప్పుడు ఆ ర్యాలీకి ముందు పోలీస్ పార్టీ కూడా ఉండాలి. ముందు, మధ్యలో, ర్యాలీ చివరన కూడా పోలీసులు సివిల్ డ్రెస్సులో ఉండి పరిస్థితిని గమనించాలి. రియల్ టైమ్ మానిటరింగ్ చేయాలి.

  చివరగా ఓ మాట. ఢిల్లీలో చనిపోయిన ట్రాక్టర్ డ్రైవర్‌ను అమరుడు అంటున్న వారికి ఒక్క విషయం చెప్పాలి. అతడు ట్రాక్టర్‌తో చేసిన విన్యాసాలు దేశం మొత్తం చూసింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్, పోలీసుల బ్యారియర్లను ఢీకొట్టుకుంటూ వెళ్లడం వల్లే అతడు చనిపోయాడు. నేరపూరితమైనది, జాతి వ్యతిరేకమైనదాన్ని వేనోళ్ల పొగడొద్దు.

  Disclaimer:The author is Former DGP, UP Police and Chancellor, Noida International University, Greater Noida. Views are personal.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు