Udaipur : రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య కేసు ఇప్పటికే దేశమంతటా సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరైన గౌస్ మహ్మద్‌కు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తేల్చింది.
గౌస్ మహ్మద్ 2014లో పాకిస్థాన్‌లోని కరాచీకి కూడా వెళ్లాడని సమాచారం. రెండో నిందితుడు రియాజ్‌ను ఉగ్రవాదం వైపు నెట్టిన గౌస్.. ఆ తర్వాత కూడా టచ్‌లో ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. గౌస్ మహ్మద్ పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు కూడా తెలిసింది.
దావత్-ఎ-ఇస్లామిక్ సంస్థ మూలం ఎక్కడ..?
దావతే-ఇస్లామిక్ సంస్థ గురించిన చర్చ ఇపుడు అంతటా జరుగుతోంది. దావతే-ఇస్లామిక్ అనేది సున్నీ మార్పిడి సమూహం. ఇది సుమారు 40 సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌లో స్థాపించబడింది. పాశ్చాత్య దేశాలలోనూ అనేక శాఖలను కలిగి ఉంది.
పాకిస్తాన్‌లోని కరాచీలో 1981లో మౌలానా ఇలియాస్ అత్తారీచే ఇది స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క నెట్‌వర్క్ దాదాపు 194 దేశాలలో విస్తరించి ఉంది. ముహమ్మద్ ప్రవక్త సందేశాలను ప్రచారం చేయడం, వ్యాప్తి చేయడం ఈ సంస్థ యొక్క ప్రధాన పని.
అన్ని దేశాల్లోనూ మత ప్రచారం చేసుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ.. మతం కోసం పీకలు కోసే బ్యాచ్ లా తయారుకావడం వల్లే ఇది ఉగ్రవాద సంస్థగా అనేక దేశాల్లో ముద్ర పడిపోయింది.
ఉదయపూర్ సంఘటన తర్వాత, హంతకులు ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో వారు ఇస్లాం, ప్రవక్తను అవమానించినట్లు ప్రస్తావించారు.
ఈ సంస్థను మహ్మద్ ఇలియాస్ అత్తారి స్థాపించి ఉండటం వల్ల.. ఆ సంస్థలో చేరిన వ్యక్తులు తమ పేరులో అత్తారి అనే పదాన్ని చేర్చుకుంటారు.
కన్హయ్య లాల్‌ను చంపిన ఇద్దరు హంతకులలో ఒకరైన రియాజ్ మహ్మద్ కూడా అతని పేరు వెనుక అత్తారి ఉంచాడు.
Read Also : NIA Alert : వీళ్లను పట్టిస్తే రూ.20లక్షల రివార్డ్.. NIA ప్రకటన
ఇప్పుడు దావతే-ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇండియాలో కూడా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి పాకిస్థాన్‌కు చెందిన దావతే-ఇస్లామిక్ కు లింక్ ఉందా అనేదానిపైనా చర్చ నడుస్తోంది.
ఈ సంస్థ యొక్క మూలాలు 1989 నుండి భారతదేశంలో విస్తరించడం ప్రారంభించాయని అధికారుల దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ నుండి ఉలేమా ప్రతినిధి బృందం మొదటిసారి భారతదేశానికి చేరుకున్నప్పుడు.. దీనిని వ్యాప్తి చేసే బాధ్యతను హఫీజ్ అనీస్ అత్తారి తీసుకున్నాడు. అలా ఇండియాలోనూ దావతే ఇస్లామిక్ వ్యాప్తి మొదలైంది.
ఇప్పుడు భారతదేశంలో దావతే-ఇస్లామిక్ సంస్థ కమాండ్.. సయ్యద్ ఆరిఫ్ అలీ చేతిలో ఉంది. దీని ప్రచారంలో భాగంగా.. ఇండియాలో పలుచోట్ల వార్షికోత్సవ ర్యాలీలు కూడా జరిగాయి. తబ్లిగీ జమాత్ సమావేశాలు కూడా ఈకోవలోనివే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, NIA, Pakistan, Terrorists