ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు ఇవే.. టాప్ 10లో 3 మనవే..

రెండో స్థానంలో వియత్నాంకు చెందిన కేన్ తో (36.7శాతం వృద్ధి), మూడో స్థానంలో చైనాకు చెందిన సుఖిన్ (36.6శాతం), నాలుగో స్థానంలో కోజికోడ్ (34.5), ఐదో స్థానంలో నైజీరియాకు చెందిన అబుజా (34.2) నిలిచాయి.

news18-telugu
Updated: January 9, 2020, 4:03 PM IST
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు ఇవే.. టాప్ 10లో 3 మనవే..
మలప్పురం పట్టణం
  • Share this:
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల జాబితా విడదలయింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ర్యాంకులను ప్రకటించింది. టాప్-10లో భారత్‌కు చెందిన పట్టణమే నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. మరో రెండు పట్టణాలు కూడా టాప్-10లో చోటు సంపాదించాయి. ఐతే వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలంటే ఏ ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాదో అని అందరు అనుకుంటారు. కానీ టాప్-10లో ఏ మెట్రో సిటీకి చోటు దక్కలేదు. అనూహ్యంగా కేరళకు చెందిన మళప్పురం 44.1శాతం వృద్ధితో టాప్ ర్యాంకు కొట్టేసింది. కోజికోడ్ 4, కొల్లామ్ 10వ ర్యాంకు సాధించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడు పట్టణాలు కేరళకు చెందినవే కావడం విశేషం.

ఇక రెండో స్థానంలో వియత్నాంకు చెందిన కేన్ తో (36.7శాతం వృద్ధి), మూడో స్థానంలో చైనాకు చెందిన సుఖిన్ (36.6శాతం), నాలుగో స్థానంలో కోజికోడ్ (34.5), ఐదో స్థానంలో నైజీరియాకు చెందిన అబుజా (34.2) నిలిచాయి. 2015-2020 మధ్య సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల జాబితాపై ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. మెట్రో సిటీలు కాకుండా చిన్న పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందడం శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణాల అభివృద్ధితో సంపద విస్తరించి.. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మరిన్ని చిన్న పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించాల్సిన అవసరం ఉందని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు.


First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు