కేరళలో (Kerala) షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. 2017 లో హర్షినా అనే మహిళ తన మూడవ కాన్పూ కోసం కోజికోడ్ లోని మెడికల్ కాలేజీకి వచ్చింది. అక్కడున్న వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. అయితే.. ఆమె పొట్టలో కత్తెరను మర్చిపోయారు. అలాగే కుట్లు వేశారు. ఈ క్రమంలో మహిళ కడుపునొప్పితో బాధపడుతుండేది. ఎన్నిసార్లు ఆస్పత్రికి వెళ్లిన డాక్టర్లు పట్టించుకోలేదు. ఏవో మాత్రలు ఇచ్చేవారు. కొన్నిరోజులు బాగున్న మరల కడుపు నొప్పి వచ్చేది.
ఇక లాభంలేదని మహిళ స్కానింగ్ చేయించింది. అప్పుడు షాకింగ్ నిజం బయటపడింది. మహిళ కడుపులో 11 సెంటీమీటర్ల కత్తెర ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే హర్షినాకు ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. దీంతో ఆమె ప్రస్తుతం కొలుకుంటుంది. వైద్యుల కేర్ లేస్ వలన ఇదంతా జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వెంటనే గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఐదేళ్లుగా ఎంతో మానసికి వేదనకు గురయ్యానని సీఎం పినరయి విజయన్, హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా తమిళనాడులోని (Tamil nadu) తిరుచ్చిలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది.
ఒక వ్యక్తి సింగపూర్ నుంచి తిరుచ్చి వెళ్తున్నాడు. అతడు తిరుచ్చి చేరుకున్నాక.. కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేశారు. అక్కడి మెటల్ డిటెక్టర్ లో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు సిగ్నల్ వచ్చింది. దీంతో పోలీసులు అతడి బ్యాగును వెతికారు. ఈ క్రమంలో అతను తన డ్రాయర్ లో (Under wear) బంగారాన్ని పేస్టుల రూపంలో అతికించాడు. ఆరకంగా బంగారంను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. దొరికిన బంగారం విలువ దాదాపు.. రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అండర్ వేర్ లో కస్టమ్స్ అధికారులు వ్యక్తి డ్రాయర్ ను తనిఖీ చేయడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, VIRAL NEWS