హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral Video: స్కూటీ లేడీ దెబ్బకు షేకైన బస్సు డ్రైవర్

Viral Video: స్కూటీ లేడీ దెబ్బకు షేకైన బస్సు డ్రైవర్

బస్సుకు అడ్డంగా స్కూటీని నిలిపిన మహిళ

బస్సుకు అడ్డంగా స్కూటీని నిలిపిన మహిళ

అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న స్థానికులు ఆ ఘటనను వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ మహిళ ధైర్యాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాహన చట్టాలు కఠినంగా ఉన్నా ట్రాఫిక్ రూల్స్‌ను చాలా మంది పట్టించుకోరు. కొందరు రాంగ్ రూట్లో దర్జాగా వెళ్తుంటారు. మరికొందరు ఎడమ వైపు లేన్ కాదని కుడివైపు లేన్‌లోకి ప్రవేశిస్తారు. ఇంకొందరు సిగ్నల్స్ జంప్ చేసి రయ్‌మని దూసుకెళ్తుంటారు. అసలు రోడ్డుపై ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి..! ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఓసారి ఎదురయ్యే ఉంటుంది. కానీ లైట్ తీసుకుంటారు. మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఇంకొందరుంటారు. ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించి.. తోటివారికి ఇబ్బందులు కలిగించే వారిని నిలదీస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ మహిళ..!

కేరళలోని ఓ ప్రాంతంలో ఓ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి రాంగ్ రూట్లో బస్సును డ్రైవ్ చేశాడు. ఎడమవైపు లేన్‌లో వెళ్లకుండా కుడి వైపు లేన్‌లోకి ప్రవేశించి.. ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంతా తిట్టుకుంటూ వెళ్లారు తప్ప.. ఏ ఒక్కరూ అతడిని ప్రశ్నించలేదు. కానీ అంతలోనే సివంగిలా స్కూటీపై ఓ లేడీ ఎంటరైంది. ఆ బస్సు డ్రైవర్‌కి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని గట్టి ఝలకే ఇచ్చింది. రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న బస్సుకు స్కూటీని అడ్డుగా పెట్టింది. బండిని పక్కకు తిప్పకుండా, అలాగే ముందుకు తీసుకెళ్లి స్కూటీని నిలిపింది. ఆమె దూకుడును చూసి షాకైన బస్సు డ్రైవర్..మెల్లగా బస్సును ఎడమ వైపునకు తిప్పి అక్కడి నుంచి జారుకున్నాడు.

అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న స్థానికులు ఆ ఘటనను వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ మహిళ ధైర్యాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లేడీ సింగం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

First published:

Tags: Kerala, Motor vehicle act, Traffic challans, Traffic rules

ఉత్తమ కథలు