హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మహిళా నయా ఐడియా.. బ్యాగ్ లో మద్యం బాటిళ్లు.. కస్టమర్లకు పెగ్గులో మద్యం.. కానీ..

మహిళా నయా ఐడియా.. బ్యాగ్ లో మద్యం బాటిళ్లు.. కస్టమర్లకు పెగ్గులో మద్యం.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

kerala: పబ్లిక్ హలిడేస్, మద్యం దుకాణాల బంద్ రోజులలో మహిళకు కస్టమర్ల నుంచి ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మద్యం ప్రియుల కోసం.. మహిళా మొబైల్ బార్ లను అందుబాటులోకి తెచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కాస్త తెలివుండాలి కానీ డబ్బులు సంపాదించడానికి బోలేడు మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది స్టార్ట్ ఆప్ బిజినెస్ లు చేస్తున్నారు. తమకున్న పరిధిలో అనేక వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు దీనికోసం తప్పుడు మార్గాలను ఫాలో అయి.. కటకటాలపాలవుతున్నారు. పోలీసులకు తెలియకుండా, అధిక మొత్తంలో మద్యంను నిల్వచేస్తున్నారు. వీటిని బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరికొందరు అర్దరాత్రి, పబ్లిక్ హలీడేస్ అని తేడాలేకుండా ఎప్పుడైన మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కువ మొత్తంలో ధరలనుపెడుతూ.. కస్టమర్లను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇంకొందరు మద్యాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలో (Kerala)  అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 37 ఏళ్ల మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని రేష్మాగా గుర్తించారు. ఆమె బ్యాగుల్లో మద్యం బాటిళ్లను పెట్టుకుని, మొబైల్ బార్ ను నడిపిస్తుంది. దీనిలో ఆమె రహస్యంగా మద్యం ప్రియులకు పెగ్గులో రూపంలో మందును సెల్ చేస్తుంది. మెయిన్ గా పబ్లిక్ హలీడే ల సమయంలో ఈ మహిళ రహస్యంగా మద్యం అమ్ముతుంటుంది. దీంతో పోలీసులు ఈమెపై నిఘాపెట్టి అరెస్టు చేశారు.

ఇదిలా  ఉండగా మధ్యప్రదేశ్‌లో (Madhya pradesh)  అమానుష ఘటన జరిగింది.

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కోసం ఎదురుచూసి చివరికి తల్లి చేతుల్లోనే ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు అనేక ఆస్పత్రులు,వాటిలో ప్రత్యేక చేశాయి. అయితే.. ఏర్పాటు చేసిన ప్రభుత్వాసుపత్రులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడి వైద్యులు, సిబ్బందిని మాత్రం బాగు చేయలేకపోతున్నారు. ప్రభుత్వ దవాఖానాలలో ఉద్యోగం చేస్తునే మరికొన్ని ఆస్పత్రులలో పని చేస్తుంటారు.

జబల్‌పూర్ జిల్లాలో వున్న ఓ ప్రభుత్వాసుపత్రికి ఓ తల్లి అనారోగ్యంతో వున్న తన ఐదేళ్ల బిడ్డను తీసుకొచ్చింది. అయితే డాక్లర్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది కాసేపు ఆగమని చేయమని చెప్పారు. దీంతో చేసేది లేక గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎదురుచూసింది. సమయం గడుస్తున్నా ఒక్క డాక్టర్ కూడా సమయానికి హాజరుకాలేదు. చివరికి వైద్యం అందక ఆ పసిబిడ్డ తల్లి చేతుల్లోనే కన్నుమూశాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Drinking wine, Kerala, VIRAL NEWS

ఉత్తమ కథలు