Home /News /national /

KERALA WILL NOT IMPLEMENT CITIZENSHIP AMENDMENT ACT SAYS CM PINARAYI VIJAYAN PVN

CM Vizayan On CAA: ఏం చేస్తారో చేస్కోండి..కేరళలో సీఏఏ అమలు చేయం!

కేరళ సీఎం పినరయి విజయన్ (ఫైల్ ఫోటో)

కేరళ సీఎం పినరయి విజయన్ (ఫైల్ ఫోటో)

Kerala CM On CAA Implementation : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA)ని కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Vizayan)గురువారం తేల్చి చెప్పారు. ఎల్డీఎఫ్‌(LDF)ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం సీఎం పినరయి విజయన్‌ పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
Kerala CM On CAA Implementation : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA)ని కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Vizayan)గురువారం తేల్చి చెప్పారు. ఎల్డీఎఫ్‌(LDF)ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం సీఎం పినరయి విజయన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ...ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం కేరళలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోదని ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందని స్పష్టం చేశారు. "రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద సిద్ధాంతాన్ని అంతా పాటించాల్సిందే. కానీ, దేశమంతటా లౌకికవాదాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. మతపరమైన పౌరసత్వం కోసం ఉవ్విళ్లూరుతున్నారు వాళ్లు. ఒక వర్గం దీనిని బాగా ప్రచారం చేస్తోంది. కానీ, అలాంటి వాటికి కేరళ వ్యతిరేకమని గుర్తించాలి. దేశంలో జరిగిన కొన్ని సర్వేలు మతపరమైన విద్వేషాలకు దారి తీశాయి. కానీ, ఇక్కడ మాత్రం మొత్తం సమాజాన్ని ఒక కుటుంబంగా చూస్తుంది మా ప్రభుత్వం. ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక సర్వేలు జరుగుతున్నాయి. కానీ మన సమాజంలో అత్యంత పేద కుటుంబాలను గుర్తించడానికి ఒక సర్వే పూర్తయింది. ఈ సర్వేలో భాగంగా తదుపరి చర్యలు తీసుకుంటాం"అని సీఎం పినరయి విజయన్ తెలిపారు.

పొరుగుదేశాలైన పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ బంగ్లాదేశ్‌లో ఏళ్లుగా వేధింపులు అనుభవించి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్శీలు, బౌద్ద మతస్తులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడమే పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశ్యం. 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తారు. 2019లో ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే దీనిపై 2019లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, కర్నాటక, ఢిల్లీల్లో ఇలాంటి ప్రదర్శనలు హింసాత్మకంగానూ మారాయి.

ALSO READ Work from Home ముగిసింది..ఉద్యోగులకు మస్క్ వార్నింగ్..ఆఫీస్ కు రండి,లేదంటే గెట్ ఔట్

అయితే, సీఏఏలో ముస్లింలు ఆందోళన చెందాల్సిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సీఏఏ వల్ల దేశంలోని ఎవరి పౌరసత్వమూ పోదని కేంద్రం చెబుతోంది. ఇటీవల వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన పశ్చిమ్ బంగో సమ్మాన్ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా..సీఏఏ అమల్లోకి రాబోదని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీవదంతులను ప్రచారం చేస్తోందని,అయితే దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతామన్నారు.CAA గతంలో, వర్తమానంలో వాస్తవం.. అది భవిష్యత్తులో కూడా వాస్తవం అని షా అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: CAA, Kerala, Pinarayi Vijayan

తదుపరి వార్తలు