హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Trans couple: మొత్తం శరీరాన్నే దానమిచ్చిన లింగమార్పిడి దంపతులు.. మరణానంతరం సైతం ఉపయోగపడతాం అంటున్న జంట..

Trans couple: మొత్తం శరీరాన్నే దానమిచ్చిన లింగమార్పిడి దంపతులు.. మరణానంతరం సైతం ఉపయోగపడతాం అంటున్న జంట..

ట్రన్స్ దంపతులు

ట్రన్స్ దంపతులు

Trans couple: మరణించిన తర్వాత కూడా మన శరీరం వేరొకరికి ఉపయోగపడితే.. అంతకంటే మహత్తర కార్యం మరోకటి ఉండదు. అందుకే చాలామంది మరణానంతరం తమ శరీరాన్ని, అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తారు. కేరళకు చెందిన ట్రాన్స్ దంపతులు తమ శరీరాన్ని వైద్య పరిశోధనకు ఇస్తామని సంతకం చేశారు.

ఇంకా చదవండి ...

మరణించిన తర్వాత కూడా మన శరీరం వేరొకరికి ఉపయోగపడితే.. అంతకంటే మహత్తర కార్యం మరోకటి ఉండదు. అందుకే చాలామంది మరణానంతరం తమ శరీరాన్ని, అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తారు. కానీ చాలా మంది ఈ విషయంలో వెనకడుగు వేస్తారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ మానవతా హృదయంతో ముందుకొచ్చి అవయవ దానాలు చేయడం కొంతమంది వల్లే సాధ్యమవుతుంది. కేరళకు చెందిన ట్రాన్స్ దంపతులు ఈ కోవకే చెందుతారు. తృప్తి శెట్టి(లింగ మార్పిడి చేసుకున్న మహిళ), తన భర్త హృతిక్ (లింగ మార్పిడి చేసుకున్న పురుషుడు) ఇద్దరూ.. మరణానంతరం తమ శరీరాన్ని వైద్య పరిశోధనకు ఇస్తామని సంతకం చేశారు. 2019లో వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు. గతంలో స్త్రీ, పురుషులకు మాత్రమే అవయవ, శరీర దానాలు ఇచ్చే అవకాశముండేది. చివరకు రిజిస్ట్రీలోని ట్రాన్స్ జెండర్‌లను సైతం చేర్చడంతో ఈ అడ్డంకి తొలగిపోయింది. ఈ విషయంపై వీరు అప్పటి కేరళ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కేకే శైలజను కలుసుకున్నారు. వైద్య విద్యార్థుల కోసం మరణానంతరం తమ శరీరాన్ని దానం చేయాలనే కోరిక గురించి ఆమెకు వివరించారు.

తమ ఫొటోలు, వివరాలతో లిఖితపూర్వకంగా అభ్యర్థనను మంత్రికి అందజేశారు. ఈ విషయంలో అవరోధంగా ఉన్న జెండర్ అడ్డంకిని ఎత్తివేయాలని మంత్రిని కోరారు. తాజాగా సాంకేతిక లోపం పరిష్కారమైందని, అవయవ దానానికి వారు సమ్మతి లేఖను ఇవ్వవచ్చని ఏప్రిల్‌లో కేరళ నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్ షేరింగ్(KNOS- మృతసంజీవిని) సంస్థ నుంచి వారికి సమాచారం అందింది. "అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను తీసుకోవాలని లేదా వైద్య కళాశాలల్లో విద్యార్థుల పరిశోధనల కోసం మొత్తం శరీరాన్ని వినియోగించుకునేలా మేము వారిని అభ్యర్థించాం. సమ్మతం ఇవ్వడానికి మృతసంజీవిని నుంచి సమాచారం అందుకున్న తర్వాత ఆగస్టు 5న ఎర్నాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పందాన్ని సమర్పించాం" అని దంపతుల్లో ఒకరైన హృతిక్ తెలిపారు.

విభిన్న జెండర్ల గురించి, ముఖ్యంగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తుల గురించి అనేక రకాల పరిశోధనలు జరుగుతున్న సమయంలో రెండు శరీరాలు వైద్య విద్యార్థులకు ఉపయోగపడతాయని తృప్తి అన్నారు. ఆభరణాల తయారీలో నిపుణురాలిగా, పారిశ్రామిక వేత్తగా ఆమె పనిచేస్తోంది. హృతిక్ న్యూస్ రీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తృప్తి స్వస్థలం మజేశ్వరం కాగా.. హృతిక్ తిరువనంతపురం వాసి. అయితే వివాహం తర్వాత వీరిద్దరు కొచ్చిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. తమ శరీరాలను దానం చేయడానికి పెద్ద మనస్సుతో ముందుకొచ్చిన ఈ దంపతులను మృతసంజీవిని సమన్వయ కర్త అనీశ్ పీవీ ప్రశంసించారు. ట్రాన్స్ జెండర్ గా అవయవదాతను నమోదు చేయడానికి ఎలాంటి కాలమ్ లేదని, లింగమార్పిడి దాతను చూడటం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. పురుషుడు, స్తీ కాలమ్ తో పాటు ట్రాన్స్ జెండర్ కాలమ్ ను కూడా రిజిస్ట్రీలో చేర్చడం ద్వారా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని తెలిపారు.

Published by:Veera Babu
First published:

Tags: Kerala, Transgender

ఉత్తమ కథలు