హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kerala Rains: కేరళలో తీవ్ర విషాదం...కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి

Kerala Rains: కేరళలో తీవ్ర విషాదం...కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 42 మంది మృతి

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 42 మంది మృతి

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందగా...పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. కొండ చరియలు విరిగిపడి 31 గుడిసెలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. 15 మంది మృతదేహాలు శిథిలాల కింద వెలికితీయగా...మరో 57 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 12 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. వీరిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురైయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.


కేరళలో కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతిఘటనా స్థలి వద్ద నాలుగు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో రిస్క్యూ ఆపరేషన్‌కి విఘాతం కలుగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రిస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. త్రిశూర్ నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్ దళం ఘటనా స్థలికి వెళ్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు తలా రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

కేరళ దుర్ఘటన...ఫోటో గ్యాలరీ..

భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఇతర జిల్లాల్లో కొండ దిగువ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

First published:

Tags: Kerala rains

ఉత్తమ కథలు