రెండు రోజుల క్రితం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. మొత్తం191 మంది ఈ విమానంలో ఉన్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే తొలి 5 నిమిషాల్లో అక్కడ ఏం జరిగిందనే అంశంపై ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది.
7.40 గంటలకు విమానం రన్ వేను దాటి స్కిడ్ అయి 32 అడుగుల కిందకు దూసుకెళ్లింది.
7.41 గంటలకు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సీఐఎస్ఎఫ్ అత్యవసర రెస్పాన్స్ టీమ్‌కు సమాచారం పంపింది.
7:42 గంటలకు ఎయిర్ పోర్టు ఫైర్ స్టేషన్‌ను అలర్ట్ చేశారు.
7:43 గంటలకు సీఐఎస్ఎఫ్ నుంచి ఎయిర్ పోర్టు హెల్త్ డిపార్ట్ మెంట్‌కు సమాచారం అందింది.
7:44 గంటలకు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎయిర్‌పోర్టు టెర్మినల్ మేనేజర్, ఎయిర్ పోర్టు డైరెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్‌కు రెండోసారి సమాచారం పంపారు.
7:45 గంటలకు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ స్థానిక పోలీసులు, అలాగే తమ యూనిట్ లైన్స్‌కు సమాచారం ఇచ్చింది.
సుమారు 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే స్థానికులు కూడా అక్కడకు వచ్చేశారు. అయితే, ప్రమాదాన్ని చూసిన ఎయిర్ పోర్టు డిప్యూటీ కమాండెంట్ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు కొందరు స్థానికులను కూడా సహాయక చర్యల కోసం అనుమతించారు. దీని వల్ల సహాయకచర్యలు చాలా త్వరగా చేయడానికి అవకాశం లభించింది. అది తెలివైన నిర్ణయం అని అందరూ అభినందిస్తున్నారు.
విమాన ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ.10 లక్షలు, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ యాజమాన్యం మరో రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.