Home /News /national /

KERALA PLANE CRASH LIVE UPDATES KERALA GOVT AND AIR INDIA EXPRESS ANNOUNCE EX GRATIA FOR DECEASED FAMILIES BA

Kerala Plane Crash | ఎయిరిండియా ప్రమాద మృతుల కుటుంబాలకు రెండు పరిహారాలు..

కేరళలో ప్రమాదానికి గురైన విమానం (Image: @HardeepSPuri)

కేరళలో ప్రమాదానికి గురైన విమానం (Image: @HardeepSPuri)

కోజికోడ్‌లో విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు కేరళ ప్రభుత్వం, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పరిహారాన్ని ప్రకటించాయి.

    కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి రెండు పరిహారాలు అందనున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కూడా బాధితులకు పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారిలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు. 12 ఏళ్లలోపు వారు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు అందించనున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 అందిస్తామని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పరిశీలించారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. విమానం నడిపిన ఎయిరిండియా పైలెట్‌కు 10,000 గంటలు విమానం నడిపిన అనుభవం ఉందన్నారు. ఇదే విమానాశ్రయంలో ఇదే పైలెట్ 27 సార్లు విమానం దింపిన అనుభవం ఉందన్నారు.



    దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ వచ్చిన ఎయిరిండియా విమానం నిన్న రాత్రి 7.40 గంటల సమయంలో ల్యాండింగ్ అవుతుండగా రన్ వే దాటి కిందకు దూసుకెళ్లింది. టేబుల్ టాప్ తరహాలో ఉండే ఈ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద బాధితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉంది. ఈ ఘటనలో సహాయకచర్యల్లో పాల్గొన్న 30 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అలాగే, సహాయకచర్యల్లో పాల్గొన్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఘటనలో చనిపోయిన ఇద్దరు ఎయిరిండియా పైలెట్ల కుటుంబసభ్యులు కోజికోడ్ చేరుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Air India, Kerala, Kerala Flight Accident, Kerala Plane Crash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు