Home /News /national /

KERALA MINISTER R BINDU DONATES GOLD BANGLE FOR KIDNEY PATIENT TREATMENT PVN

హ్యాట్సాఫ్ : కిడ్నీ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం..తన చేతి బంగారు గాజు విరాళమిచ్చిన మంత్రి

 పేషెంట్ ట్రీట్మెంట్ కోసం బంగారు గాజు విరాళమిచ్చిన మంత్రి

పేషెంట్ ట్రీట్మెంట్ కోసం బంగారు గాజు విరాళమిచ్చిన మంత్రి

Minister Donates Gold Bangle : కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు మానవత్వం చాటుకున్నారు. కిడ్ని పేషెంట్ ట్రీట్మెంట్ కోసం తన బంగారు గాజుని ఆమె విరాళంగా ఇచ్చారు. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడి వైద్య సహాయ కమిటీ సమావేశానికి...ఇరింజలకుడ ప్రతినిధిగా మంత్రి ఆర్ బిందుని ఆహ్వానించారు.

ఇంకా చదవండి ...
  Minister Donates Gold Bangle : కేరళ ఉన్నత విద్యా మంత్రి(Kerala Minister) ఆర్ బిందు మానవత్వం చాటుకున్నారు. కిడ్ని పేషెంట్ ట్రీట్మెంట్ కోసం తన బంగారు గాజుని ఆమె విరాళంగా ఇచ్చారు. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడి వైద్య సహాయ కమిటీ సమావేశానికి...ఇరింజలకుడ ప్రతినిధిగా మంత్రి ఆర్ బిందుని ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి.. కిడ్నీ మార్పిడి(Kidney Transplant)చేయించుకోవాల్సిన వివేక్ ప్రభాకర్ అనే 27 ఏళ్ల యువకుడి దీనస్థితిని చూసి చలించిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వివేక్‌కు శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలు దక్కవని తెలిసి వేదికపైనే మంత్రి కంట కన్నీరు కార్చారు. వివేక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి.. వివేక్ సోదరుడు విష్ణు ప్రభాకరన్ వద్దకు  వెళ్లారు.

  ఆమె వెంటనే తన మణికట్టు నుండి బంగారు గాజుని(Gold Bangle)తీసివేసి వివేక్ ట్రీట్మెంట్ ఖర్చుకు మొదటి విరాళంగా ఇచ్చింది. మంత్రి పని ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఇతరులు కూడా తమ వంతుగా వివేక్ కు సాయమందింయేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా,వివేక్ తల్లిదండ్రులు ప్రభాకరన్, సరస్వతి కూడా అనారోగ్యంతో ఉన్నారు. వృత్తి రీత్యా ప్లంబర్ అయినప్పటికీ ఇతర ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

  Cancer Symptoms : శరీరంలో ఈ మార్పులు క్యాన్సర్ కి సంకేతాలు!

  మరోవైపు,కొత్తగా సైబర్‌ నేరగాళ్లు ఎంతుకున్న మార్గం కరెంటు బిల్లులు. ఏంటీ క‌రెంట్ బిల్లుల‌తో మోసాలు ఎలా చేస్తారని ఆశ్చ‌ర్య‌పోతున్నారా పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌ పేరుతో ఓ సైబర్‌ మోసగాడు చేసిన ఘనకార్యం తెలుసుకోవాల్సిందే. మీకు మీ పెండింగ్ క‌రెంట్ బిల్లులు క్లియర్‌ చేస్తామని చెప్పి ఈ కేటుగాళ్లు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ ఉద్యోగిగా నటిస్తూ మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. అలా సంప్ర‌దించి మీ క‌రెంట్ బిల్లు మేమే క‌డ‌తాం మీరు కేవ‌లం మేము చెప్ప‌ని యాప్ మీ ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకుంటే చాలని నమ్మబలుకుతారు. వాళ్ల‌ని న‌మ్మి మీరు ఈ యాప్ మీ ఫోన్ లో వేసుకున్నారో ఇక అంతే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవ‌డం ఖాయం. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడే హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి కేవలం రెండు వేల రూపాయిల కరెంట్ బిల్లు కోసం సుమారు  8 ల‌క్ష‌ల రూపాయిలు పోగొట్టుకున్నాడు. అసలు ఈ తరహా మోసం ఎలా జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.  సైబ‌ర్ నేరాగాళ్లు మ‌న  మొబైల్ ఫోన్‌కు SMS లేదా వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపింస్తాడు. ఆ మెసేజ్‌లకు స్పందించిన బాధితుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని  తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని మీరు కరెంటు బిల్లులు చెల్లించలేదు అందుకే మీకు కరెంట్ సప్లై నిలిపివేస్తోన్నామని పోన్ కట్ చేస్తారు. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే మ‌ళ్లీ అదే వ్య‌క్తి మీకు ఫోన్ చేసి ఇప్పుడే చెక్ చేశాం క్రింద‌టి నెల యూనిట్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది. మీరు మేము చెప్పిన యాప్‌ని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఒక 30 రూపాయిలు చెల్లిస్తే చాలు మీరు ఈ నెల ప‌వ‌న్ బిల్ క‌ట్టావ‌స‌రం లేద‌ని చెబుతారు. దీంతో సాదార‌ణంలో ప‌వ‌న్ కట్ అవుతుంద‌నే ఆందోళ‌న‌లో మ‌నం క‌నీసం చెక్ చేసుకోం వాళ్లు పంపించిన లింక్‌లోని యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్లు చెప్పినట్లుగా హైదరాబాద్‌కి చెందిన బాధితుడు డబ్బులు చెల్లించాడు. అంతే అక్కడి నుంచి ఎవరైతే 30రూపాయలు కట్టాడో అతని బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బులు పోవడం మొదలైంది. అయితే అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఒకే ట్రాన్సక్షన్‌లో డబ్బులు లాగేస్తారు. తక్కువగా ఉంటే కొద్ది కొద్దిగా డబ్బును కాళీ చేస్తున్నాట్లుగా తేల్చారు పోలీసులు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Donation, Gold jewellery, Kerala, Minister

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు