కేరళ.. ఆదిమాలి పట్టణంలోని వలారాకి దగ్గర్లోని దేవియార్ కాలనీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడి పుతాన్‌పురాయిల్ ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని చుట్టుపక్కల వారు చూశారు. ఆ ఇంటికి చెందిన దాల్విన్... ఓ పక్క ఇల్లు తగలబడుతూ ఉంటే... మొబైల్‌లో వీడియో కెమెరా ఆన్ చేసి.. లైవ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కనిపించాడు.
అతన్ని చూసిన వాళ్లు ఉలిక్కిపడ్డారు. ఇదేంటి ఇలా చేస్తున్నాడు... బాబోయ్ అనుకుంటూ... వెంటనే అలర్ట్ అయ్యి... అందరూ కలిసి... తగలబడుతున్న ఇంటి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కాసేపు కష్టపడ్డాక... మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అప్పటికే ఇంట్లోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. ఇల్లు కూడా కొంతవరకూ కాలిపోయింది.
ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అందువల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ దాల్విన్ ఇలా ఎందుకు చేశాడన్నది హాట్ టాపిక్ అయ్యింది. స్థానికుల్లో కొందరికి అతని సంగతి తెలుసు. అతనికి మతి స్థిమితం లేదు. స్థానికంగా వర్క్ షాప్ నిర్వహిస్తూ బతుకుతున్నాడు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు... ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఏ కంప్లైంటూ లేదన్న కుటుంబ సభ్యులు.. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని పోలీసులకు తెలిపారు.
కొవ్వొత్తి మంటతోనే ఇంటిని తగలబెట్టినట్లు దర్యాప్తులో తెలిసింది. ఇలా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Telugu news