కాలికి టీకా వేయించుకున్న యువకుడు.. చేతికి బదులు కాలికి టీకా తీసుకున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు.. వివరాలివే..

టీకా తీసుకుంటున్న ప్రణవ్

ఏడాదిన్నర కాలంగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్​కు చెక్​పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను​ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్​ అందజేశారు. అయితే, వ్యాక్సిన్​ సహజంగా చేయికి ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ, కేరళకు చెందిన ఒక యువకుడికి మాత్రం కాలికి ఇచ్చారు. అతనికి రెండు చేతులు లేకపోవడమే దీనికి కారణం.

  • Share this:
ఏడాదిన్నర కాలంగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్​కు చెక్​పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను​ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్​ అందజేశారు. అయితే, వ్యాక్సిన్​ సహజంగా చేయికి ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ, కేరళకు చెందిన ఒక యువకుడికి మాత్రం కాలికి ఇచ్చారు. అతనికి రెండు చేతులు లేకపోవడమే దీనికి కారణం. ఇలా దేశంలో తొలిసారి కాలికి వ్యాక్సిన్​ తీసుకున్న మొదటి వ్యక్తిగా ఆ యువకుడు నిలిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో పాలక్కడ్​ జిల్లాలోని అలతుర్​ గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రణవ్ బాలసుబ్రహ్మణ్యం పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించాడు. అయితే, కరోనా వైరస్​ ప్రమాదం నుంచి బయటపడేందుకు తాను ఎలాగైనా వ్యాక్సిన్​ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతనికి రెండు చేతులు లేకపోవడం వ్యాక్సిన్​ తీసుకునేందుకు ప్రతిరోధకంగా మారింది. ఎందుకంటే వ్యాక్సిన్​ కేవలం చేతి తుంటికి మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటివరకు కాలుకు టీకా వేసిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ, ఎలాగైనా వ్యాక్సిన్​ వేసుకోవాలన్న పట్టుదల అతన్ని ముందుకు నడిపించింది.

వ్యాక్సిన్​ కోసం స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకొని అలథూర్‌ పోలీస్ స్టేషన్‌లోని టీకా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, టీకా కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తలు మాత్రం ప్రణవ్‌కు ఎలా టీకాలు వేయాలనే దానిపై అయోమయంలో పడ్డారు. అతనికి కాలికి టీకా ఇస్తే ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని గ్రహించి ఆరోగ్య శాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వారి నుంచి అనుమతి తీసుకొని ప్రణవ్ కాలుకు కోవిషీల్డ్ టీకా మొదటి డోసు ఇచ్చారు. ఇలా కాలుకు టీకా తీసుకున్న మొదటి వ్యక్తిగా ప్రణవ్​ రికార్డుకెక్కాడు. కాగా, రెండు చేతులు లేనప్పటికీ.. ప్రణవ్​ తన సైకిల్ నడుపుతూ టీకా కేంద్రానికి చేరుకున్నాడు. అంతేకాదు, భవిష్యత్తులో కారు కూడా నడుపుతానని.. ఫోర్​ వీలర్​ లైసెన్స్ పొందాలనేది తన కలగా ప్రణవ్ పేర్కొన్నాడు.

కాలికి టీకా తీసుకున్న మొదటి వ్యక్తి..
ప్రణవ్ ఇలా వార్తల్లోకి ఎక్కడం ఇది మొదటిసారేమీ కాదు. 2019లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సెల్ఫీ తీసుకొని తన 21వ పుట్టినరోజు జరుపుకున్నాడు. వరద బాధితులకు సహాయం చేయడానికి తన సేవింగ్స్​ నుంచి రూ .5 వేల మొత్తాన్ని ముఖ్యమంత్రి డిస్​స్ట్రెస్​ రిలీఫ్​ ఫండ్​ (సిఎమ్‌డిఆర్‌ఎఫ్) కు అందజేశాడు. ప్రణవ్​ సొంతంగా బొమ్మలు గీసి తన పెయింటింగ్స్​ను అమ్ముతుంటాడు. అలా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు సహాయ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నాడు. ప్రణవ్ అలథూర్​లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో నుండి బి.కామ్(కామర్స్)లో డిగ్రీ పట్టా పొందాడు.
Published by:Veera Babu
First published: