Home /News /national /

KERALA MAN APPLIES FOR E PASS AS HE WANTS TO GO OUT FOR SEX VB

E-Pass: ఈ పాస్ కోసం విచిత్ర అభ్యర్థన.. శృంగారం కోసం బయటకు వెళ్లాలంటూ.. చివరకు పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

E-Pass: లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లాలంటే తన అవసరాన్ని సూచిస్తూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలి. వాళ్లు నిజమైనది నిర్దారించి ఈ పాస్ జారీ చేస్తారు. కానీ కొంతమంది శృంగారం కోసం బయటకు వెళ్లాలని ఒకరు.. మొటిమ‌ల చికిత్స కోసం అంటూ మరొకరు ఇలా దరఖాస్తులు చేస్తున్నారు. చివరకు పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. ఈ ఘటన కేరళ లో జరిగింది. పూర్తి వివరాలు..

ఇంకా చదవండి ...
    ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. అందులో ఉల్లి గడ్డ ఉడుకుతుందా.. అని అన్నడంటా.. అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. కరోనా సెకండ్ వేవ్ తో ప్రాణాలు పోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పాస్ ఉంటేనే తాము పంపుతామంటూ పోలీసులు ఎక్కడికక్కడ ఆపుతున్నారు. ఇలాంటి సమయంలో అల్లరి మూకలు ఎలాగైనా బయటకు వెళ్లాలంటూ కోతి చేష్టలు చేస్తున్నారు. ఏదో ఒక కారణంగా బయటకు వెళ్లాలనే ఉద్యేశ్యంతో ఒకడు విచిత్రంగా ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను శృంగారం కోసం బ‌యిటికెళ్లాలి.. తనకు ఈ పాస్ ఇప్పించండంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు ఆ అభ్యర్థనకు కంగు తిన్నారు. అతడి చిరునామా కనుక్కొని మరీ అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. అయితే కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తి ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు.

    దాంట్లో ఓ చిత్ర‌మైన అభ్య‌ర్థ‌న చేశాడు. శృంగార కోసం బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్య‌క్తి పోలీసుల్ని కోరాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అప్లికేష‌న్ పెట్టిన వ్యక్తి అడ్రస్ కనుకున్నారు. అతడు కన్నూరులోని ఇరినేవ్వ గ్రమస్తుడిగా గుర్తించారు. వాలాప‌ట్ట‌ణం పోలీసులు అతడి వద్దకు వెళ్లి అరెస్టు చేసి పోలీస్టేషన్ కు తీసుకొచ్చారు. ఎందుకు ఇలా అభ్యర్థన పెట్టావని పోలీసులు నిలదీయగా అక్షర దోశం వల్ల ఇలా జరిగిందని వ్యక్తి చెప్పాడు. పొరపాటు జరిగిందని పోలీసుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు. ఇంగ్లీషులో ‘six o clock’ అని రాయాల‌ని అనుకున్నాన‌ని, కానీ త‌న ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున‌ ‘sex’ అని ప‌డిన‌ట్లు తెలిపాడు. ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించిన పోలీసులు.. అన‌వ‌స‌ర కార‌ణాల‌తో ఈ-పాస్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ద్దు అంటూ అత‌న్ని రిలీజ్ చేశారు.

    ఇలా టైం పాస్ గా కూడా దరఖాస్తులను సమర్పిస్తున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బీహార్‌లోనూ ఓ వ్య‌క్తి కూడా చిత్ర‌మైన కార‌ణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాల‌ని కోరాడు. మొటిమ‌ల చికిత్స కోసం వెళ్లేందుకు త‌న‌కు పాస్ ఇవ్వాల‌ని అత‌ను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. నిజంగా ఏదైనా పని ఉంటే మాత్రమే ఈ పాస్ కు దరఖాస్తు చేసుకోవాలని.. లేదంటే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Application, Arrest, Bihar, E pass, Kerala, Lockdown, Police, Sex

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు