కొంపముంచిన Google Maps.. ఊహించని మలుపు తిరిగిన ప్రయాణం.. అసలేం జరిగిందంటే..

కొంపముంచిన Google Maps

కొత్త ప్రదేశాలకు వెళ్లే వారు స్థానికులను రూట్ అడిగే పని లేకుండా.. వెళ్లాల్సిన చోటుకు గూగుల్ మ్యాప్స్‌ దారి చూపిస్తున్నాయి. దీంతో చాలా లాభాలే ఉన్నాయి. అయితే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం గూగుల్ మ్యాప్స్‌ను (Google Maps) నమ్ముకున్న కొందరు చిక్కులో పడుతున్నారు.

 • Share this:
  ఇటీవలి కాలంలో గూగుల్ మ్యాప్స్ వాడకం విపరీతంగా పెరిగింది. చాలా మంది వాహనదారులు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లే వారు స్థానికులను రూట్ అడిగే పని లేకుండా.. వెళ్లాల్సిన చోటుకు గూగుల్ మ్యాప్స్‌ దారి చూపిస్తున్నాయి. దీంతో చాలా లాభాలే ఉన్నాయి. అయితే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం గూగుల్ మ్యాప్స్‌ను (Google Maps) నమ్ముకున్న కొందరు చిక్కులో పడుతున్నారు. గూగుల్ మ్యాప్స్ చూసి సరైన దారిలో కాకుండా.. సులభంగా గమ్యస్థానం చేరుకోవచ్చని వేరే మార్గంలో ప్రయాణించిన లారీ డ్రైవర్లకు గట్టి షాక్ తగిలింది. అవి భారీ వాహనాలు కావడంతో మూల మలుపు వద్ద లారీ బోల్తా పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటీవల కేరళలో (Kearala) చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

  రెండు భారీ లారీలు.. మంగళూరు(Mangalaur) నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్నాయి. వాటిలో ఎలక్ట్రిక్ మోటార్స్‌లో వాడే కాయిల్ లోడ్ ఉంది. అయితే లారీల డ్రైవర్లు ఆ రూట్‌లో కొత్తగా ప్రయాణం చేస్తున్నారు. అయితే అవి భారీ వాహనాలు కావడంతో.. వారు పాలక్కాడ్-వాలయార్ మీదుగా ప్రయాణించాలి. కానీ నెలిపుజా (Nellipuzha) చేరుకున్న డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ చూసి.. అట్టపడి రూట్‌లో (Attappadi ghat road) ప్రయాణం మొదలుపెట్టారు. రెండు లారీలు అనమూలీ చెక్‌ పోస్ట్ దాటాయి. ఘాట్ రోడ్డులో ప్రవేశించాక.. భారీ లారీలు కావడంతో అవి తిరగడానికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ఒక లారీ మలుపు వద్ద బోల్తాపడింది. మరో లారీ ఎట్టువెళ్లడానికి వీలు లేకుండా మరో మూల మలుపు వద్ద ఇరుక్కుపోయింది. దీంతో ఒక్క బైక్ కూడా వెళ్లలేని విధంగా ట్రాఫిక్‌ జామ్ అయింది.

  Kerala Rains: కేరళలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్.. భయానకంగా పరిస్థితులు Photos

  దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 12 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్ సమస్య ఎదుర్కొన్నారు. మరుసటి రోజు మన్నర్‌క్కడ్‌ నుంచి క్రేన్‌ను రప్పించి.. లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. అయితే ఈ ఘటనపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లారీలను ఘాట్ రోడ్డు గుంగా వెళ్లవని తెలిసి కూడా అనుమతివ్వడం అధికారుల తప్పేనని ఆరోపించారు. మరోవైపు మన్నర్‌క్కడ్ డీఎఫ్‌వో సుర్జీత్ (Mannarkkad DFO Surjith) మాట్లాడుతూ.. ఘాట్‌ రోడ్డు ఏ విధమైన వాహనాలు ప్రయాణించాలి అనే దానిపై అటవీ శాఖకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: