HOME »NEWS »NATIONAL »kerala local body election results 2020 good news for cm pinarayai vijayan ahead of assembly polls as ldf wins sk

Kerala Local Body Election Results: కేరళలో LDF హవా.. విజయన్‌కు బిగ్ బూస్ట్

Kerala Local Body Election Results: కేరళలో LDF హవా.. విజయన్‌కు బిగ్ బూస్ట్
ప్రతీకాత్మక చిత్రం

Kerala Local Body Election Results: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు..ఇలా అన్ని చోట్లా LDF విజయ బావుటా ఎగురవేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇబ్బందులు పెడుతున్న వేళ పినరయి విజయన్‌కు ఈ విజయం బిగ్ బూస్ట్ ఇస్తోంది.

  • Share this:
    Kerala Local Body Election Results 2020: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో LDF (లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) సత్తా చాటింది. తమకు తిరుగులేనదని మరోసారి నిరూపించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు..ఇలా అన్ని చోట్లా విజయ బావుటా ఎగురవేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇబ్బందులు పెడుతున్న వేళ పినరయి విజయన్‌కు ఈ విజయం బిగ్ బూస్ట్ ఇస్తోంది. ఇక కాంగ్రెస్ కాస్త బలహీన పడింది, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఓట్ల శాతాన్ని పెంచుకొని క్షేత్రస్థాయిలో బలపడుతోంది.

    మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు... LDF 516 గ్రామ పంచాయతీలు, 108 మండల పంచాయతీలు, 10 జిల్లా పంచాయతీలు, 35 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్‌లలో లీడింగ్‌లో ఉంది. ఇక UDF.. 369 గ్రామ పంచాయతీలు, 44 మండల పంచాయతీలు, 4 జిల్లా పంచాయతీలు, 45 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్‌లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే మాత్రం తక్కువ చోట్ల ఆధిక్యంలో ఉంది. కేవలం 23 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో లీడింగ్‌లో ఉంది.




    కాగా, కేరళలో 941 గ్రామ పంచాయతీలు, 152 మండల పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబరు 8న తిరువనంతపురం, కొల్లాం, పతానంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి జిల్లాల్లో తొలి దశ ఎన్నికలు జరిగాయి. ఇక డిసెంబరు 10న కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, వయానడ్ జిల్లాల్లో రెండో దశ, డిసెంబరు 14న మలప్పురం, కన్నూరు, కాసర్‌గఢ్, కోజికోడ్ జిల్లాల్లో తుదిదశ పోలింగ్ జరిగింది. ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:December 16, 2020, 14:25 IST