HOME »NEWS »NATIONAL »kerala local body election results 2020 bjp is leading in thiruvananthapuram corporation sk

Kerala Local Body Election Results: బీజేపీ మరో సంచలనం.. కేరళ రాజధానిలో దూకుడు

Kerala Local Body Election Results: బీజేపీ మరో సంచలనం.. కేరళ రాజధానిలో దూకుడు
ప్రతీకాత్మక చిత్రం

Kerala Local Body Election Results: తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీలో లీడింగ్‌లో ఉంది. 13 వార్డుల్లో ఎన్డీయే, 12 వార్డుల్లో ఎల్డీఎఫ్, 4 వార్డుల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

  • Share this:
    Kerala Local Body Election Results 2020: కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐతేే తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీలో లీడింగ్‌లో ఉంది. 13 వార్డుల్లో ఎన్డీయే, 12 వార్డుల్లో ఎల్డీఎఫ్, 4 వార్డుల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. మరి కమలం జోష్‌కు ఎల్డీఎఫ్ కళ్లెం వేసి.. లీడ్‌లోకి వస్తుందా? లేదంటే బీజేపీనే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా? అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.

    ఉదయం 10 గంటల సమయానికి.. ఎల్డీఎఫ్ 363 గ్రామ పంచాయతీలు, 92 మండల పంచాయతీలు, 11 జిల్లా పంచాయతీలు, 39 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్‌లలో లీడింగ్‌లో ఉంది. ఇక యూడీఎఫ్.. 320 గ్రామ పంచాయతీలు, 58 మండల పంచాయతీలు, 3 జిల్లా పంచాయతీలు, 38 మున్సిపాలిటీలు, ఒ కార్పొరేషన్‌లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే మాత్రం తక్కువ చోట్ల ఆధిక్యంలో ఉంది. కేవలం 29 గ్రామ పంచాయతీలు, రెండు మండల పంచాయతీ, 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో లీడింగ్‌లో ఉంది.




    కాగా, కేరళలో 941 గ్రామ పంచాయతీలు, 152 మండల పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబరు 8న తిరువనంతపురం, కొల్లాం, పతానంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి జిల్లాల్లో తొలి దశ ఎన్నికలు జరిగాయి. ఇక డిసెంబరు 10న కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, వయానడ్ జిల్లాల్లో రెండో దశ, డిసెంబరు 14న మలప్పురం, కన్నూరు, కాసర్‌గఢ్, కోజికోడ్ జిల్లాల్లో తుదిదశ పోలింగ్ జరిగింది. ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:December 16, 2020, 10:10 IST