హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేరళ ఇండియాలో రాష్ట్రం.. దయచేసి సరిదిద్దండి.. అర్జెంటినాకు యూపీ పోలీస్ డిమాండ్

కేరళ ఇండియాలో రాష్ట్రం.. దయచేసి సరిదిద్దండి.. అర్జెంటినాకు యూపీ పోలీస్ డిమాండ్

అంజలి కటారియా (image credit - twitter - @AnjaliKataria19)

అంజలి కటారియా (image credit - twitter - @AnjaliKataria19)

FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా.. అర్జెంటినా చేసిన ఓ పని.. భారతీయులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

FIFA World Cup : ఫుట్‌బాల్‌లో ప్రపంచకప్ సాధించిన సందర్భంగా... తమ మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు చెబుతూ అర్జెంటినా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ట్వీట్ షేర్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆ ట్వీట్‌ని సరిదిద్దాలని ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి కోరారు. ఇంతకీ అర్జెంటినా ట్వీట్‌లో ఏముందంటే.. “ధన్యవాదాలు బంగ్లాదేశ్, ధన్యవాదాలు కేరళ, భారతదేశం, పాకిస్తాన్‌. మీ మద్దతు అద్భుతమైనది" అని టీమ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @Argentinaలో ట్వీట్ చేసింది.

ఆర్జెంటినా ట్వీట్‌ని ఇక్కడ చూడండి.

ఉత్తరప్రదేశ్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ (DSP) అంజలి కటారియా ఈ ట్వీట్‌ పై అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆమె రీ-ట్వీట్ చేశారు. అందులో ఏం రాశారంటే.. "కేరళ భారతదేశంలోని ఒక రాష్ట్రం. భారతదేశంలో అంతర్భాగం, దయచేసి సరిచేయండి" అని అంజలి కటారియా ట్వీట్‌లో డిమాండ్ చేశారు. ఐతే.. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆమె దాన్ని డిలీట్ చేశారు.

అంజలి ట్వీట్‌లోని అంశాన్ని ఇక్కడ చూడండి.

అంజలి కటారియా ట్వీట్ (image credit - twitter - @AnjaliKataria19)

ఈ విషయంపై న్యూస్18 కేరళ టీమ్ ఇచ్చిన వార్తను ఆమె మెచ్చుకున్నారు. తన అభిప్రాయాన్ని కేరళ ప్రజలకు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.

అర్జెంటినా జట్టుకు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో అభిమానులున్నారు. ఈ అభిమానులలో భారతదేశంలోని కేరళలో ఉన్న మలయాళీలు, బెంగాలీలే ఎక్కువ. ఈసారి ఖతార్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అర్జెంటినాకు మలయాళీలు గట్టి సపోర్ట్ పలికారు. అర్జెంటినా మ్యాచ్‌ల చూసేందుకు మలయాళీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందువల్ల అర్జెంటినా ఈ ట్వీట్ చేసింది. ఐతే.. ఇందులో కేరళను ప్రత్యేక దేశంగా చెప్పడమే వివాదాస్పదం అయ్యింది. ఇప్పటికీ ఆ ట్వీట్‌ని సరిదిద్దలేదు.

First published:

Tags: FIFA World Cup 2022, Kerala

ఉత్తమ కథలు