Assistant Professor: అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ ఉండాలన్న కేరళ హైకోర్టు.. తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ఏఐసీటీఈ రూల్స్​ ప్రకారం, అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేయాలంటే సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసే సరిపోయేది. ఇదే అర్హతతో అనేక మంది

  • Share this:
ఇంజినీరింగ్​, మెడిసిన్​ వంటి వృత్తి విద్యా కళాశాలల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేయాలంటే ఇప్పటివరకు సంబంధిత విభాగంలో పీజీ అర్హతగా ఉండేది. కానీ కేరళ హైకోర్టు మాత్రం ఇటీవల దీనికి భిన్నమైన తీర్పు వెలువరించింది. అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేయాలంటే కచ్చితంగా పీహెచ్​డీ చేసి ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఏఐసీటీఈ రూల్స్​ ప్రకారం, అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేయాలంటే సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసే సరిపోయేది. ఇదే అర్హతతో అనేక మంది అసిస్టెంట్​ ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు. కానీ కేరళ హైకోర్టు తీర్పుతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్ల కేరళ హైకోర్టు తాజా తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు ముగ్గురు అసిస్టెంట్​ ప్రొఫెసర్లు. వారి పిటిషన్​పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, హేమంత్ గుప్తా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. జూలై​ 3న తీర్పు వెలువరించింది.

వృత్తి విద్యా కళాశాలల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పిహెచ్​డి తప్పనిసరి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ తీర్పు వెనుక ఉన్న కారణాలేమిటో తెలియజేయాలని, ఈ విషయంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధలు ఎలా ఉన్నాయో చెప్పాలని కోరింది. ఏఐసీటీఈ నిబంధనలపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, రాష్ట్ర ప్రభుత్వం, సాంకేతిక విద్య డైరెక్టర్ల స్పందనలను కోరింది.

ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జస్టిస్ కౌల్ నేతృత్వంలోని కేరళ హైకోర్టు ధర్మాసనం 2020 డిసెంబర్ 3న అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నియామకానికి పీహెచ్​డీ తప్పనిసరి చేస్తూ తీర్పు వెలువరించింది. కేరళ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ సర్వీస్​, 1967 (స్పెషల్​ రూల్స్​) ప్రత్యేక నిబంధన 6A (ii) లో ఈ నియమం ఉందని అప్పట్లో గుర్తు చేసింది. 2003లో కేరళ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నిబంధనను కూడా జోడించింది. అయితే, పిహెచ్​డీ పొందడానికి గరిష్టంగా ఏడు సంవత్సరాల సమయం మాత్రమే ఇచ్చింది. ఇదిలా ఉంటే, 2010 మార్చి 5 తర్వాత ఈ నిబంధనలను ఏఐసీటీఈ ఎత్తేసింది. దీంతో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్​గా చేరాలంటే పీహెచ్​డీ తప్పనిసరి కాదు. కానీ, కేరళ హైకోర్టు మాత్రం దీనికి భిన్నమైన తీర్పునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో పనిచేసే ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

పిటిషనర్లు వాదిస్తూ 2016లో సుప్రీంకోర్టు సమర్థించిన ప్రత్యేక నిబంధనల రూల్ 6 ఎ (ii) ప్రామాణికతను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు తీర్పును పునఃసమీక్షించుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేకాదు, అసిస్టెంట్​ ప్రొఫెసర్ల అర్హతపై ఎఐసిటిఈ జారీ చేసిన అన్ని నిబంధనలను పరిశీలించాలని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టుకు కేరళ హైకోర్టు ఎటువంటి రిప్లై ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
First published: