• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • KERALA HIGH COURT SENSATIONAL JUDGEMENT OF CHILD BORN WHILE IN LIVE IN RELATIONSHIP WILL MUST BE TREATED AS MARRIED COUPLE BABY HSN

ఓ జంట సహజీవనం.. బిడ్డ పుట్టిన తర్వాత విబేధాలు.. దత్తతకు ఇచ్చేసి మళ్లీ కావాలంటూ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు..!

ఓ జంట సహజీవనం.. బిడ్డ పుట్టిన తర్వాత విబేధాలు.. దత్తతకు ఇచ్చేసి మళ్లీ కావాలంటూ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు..!

ప్రతీకాత్మక చిత్రం

ఓ జంట సహజీవనంలో ఉండగా బిడ్డ పుడితే, ఆ బిడ్డను అతడికి చెప్పుకుండానే ఎవరికైనా దత్తత ఇవ్వండంటూ అనాథాశ్రమానికి ఇచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆమెతో సహా అతడు తిరిగొచ్చి బిడ్డను ఇవ్వమని డిమాండ్ చేస్తే..

  • Share this:
    ఓ యువతి, ఓ యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి పట్ల సదభిప్రాయం లేని వాళ్లిద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. వాళ్లకు ఓ పాప కూడా పుట్టింది. అయితే పాప పుట్టిన తర్వాతే వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. చీటికీమాటికీ గొడవలు రాసాగాయి. దీంతో అతడు పాపను, ఆమెను వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. తానొక్కదాన్నే ఆ పాపను పెంచలేననుకుందో ఏమో కానీ ఆమె కూడా ఆ పాపను అనాథాశ్రమానికి ఇచ్చేయాలనుకుంది. అదే పని చేసింది కూడా. కానీ కొన్నాళ్లకే అతడు మనసు మార్చుకున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పాప కూడా కావాలంటున్నాడు. నిబంధనలు ఒప్పుకోవని అనాథాశ్రమం నిర్వాహకులు చెప్పడంతో కోర్టు మెట్లెక్కాడు. ఏంటీ, ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు, కేరళ రాష్ట్రంలో జరిగిన రియల్ సీన్.

    పెళ్లి కాని జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత అతడు ఆమెకు దూరంగా వెళ్లిపోయాడు. దీంతో ఆ పాపను ఎవరికైనా దత్తత ఇవ్వమని ఆమె కోరింది. వాళ్లు కూడా సరేనని చెప్పి వేరే వాళ్లకు దత్తత ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ జంటగా వచ్చి మా పాప మాకు కావాలంటున్నారు. నిబంధనల ప్రకారం పెళ్లికాక ముందు జరిగిన వ్యవహారంకాబట్టి, ఆ పాపకు వీళ్లు తల్లిదండ్రులు కాదని అధికారులు చెబుతున్నారు. వదిలేసిన బిడ్డగా తాము ఆ బిడ్డ వివరాలను నమోదు చేసుకున్నామన్నారు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుకున్న ఆ జంట కేరళ హైకోర్టు మెట్లెక్కింది. అనాథాశ్రమాలకు ఇచ్చేటప్పుడు దత్తత ఇచ్చేందుకు అంగీకార పత్రంపై పెళ్లయిన భార్యాభర్తలిద్దరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    ఒకవేళ ఆ దంపతుల్లో ఒక్కరుమాత్రమే అందుబాటులో ఉండి, మరొకరు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో తెలియకపోతే ఆ బిడ్డను ’వదిలివేయబడిన బిడ్డ‘గా భావిస్తారు. ఈ సమయంలో దత్తత ప్రక్రియలో తల్లిదండ్రులు ఇద్దరూ చేయాల్సిన ప్రక్రియను అనుసరించాల్సిన పనిలేదు. అయితే ఆ బిడ్డ చట్టబద్ధంగా పెళ్లయిన వాళ్లకు పుట్టిన బిడ్డగానే పరిగణించాల్సి ఉంటుంది‘ అని ఉన్న జువైనల్ జస్టిస్ యాక్ట్ అండ్ అడాప్షన్ రెగ్యులేషన్స్-2017 చట్టాన్ని ఈ నేపథ్యంలో కోర్టు గుర్తు చేసింది. కేరళ హైకోర్టులో కేసు విచారణ జరిగిన ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ మహ్మద్ ముస్తాఖీ, జస్టిస్ ఎడప్పగత్ ఈ కేసులో తుది తీర్పును ఇచ్చారు. ఆ బిడ్డను వేరొకరికి దత్తత ఇచ్చే ప్రక్రియను ఆపేయాలనీ, ఆ బిడ్డపై అవతలి వారికి ఎలాంటి హక్కులు ఉండవని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ బిడ్డను ఈ జంటకు మళ్లీ తిరిగి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు