హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mental Cruelty : కొంపదీసి మీ భార్యను ఆ మాటలతో టార్చర్ చేస్తున్నారా..? అయితే, అది నేరమే అంటున్న హైకోర్టు..

Mental Cruelty : కొంపదీసి మీ భార్యను ఆ మాటలతో టార్చర్ చేస్తున్నారా..? అయితే, అది నేరమే అంటున్న హైకోర్టు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mental Cruelty : ఓ మహిళ పెళ్లి అయిన నెల రోజులకే విడిపోయింది. అనంతరం విడాకుల(Divorce) కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినా.. భర్త అప్పీలు చేయడంతో

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు ధర్మాసనం. భార్య ఆకర్షణీయంగా లేదనడం, ఇతర స్త్రీలతో పోల్చడం వంటివి క్రూరత్వం కిందకు వస్తాయని పేర్కొంది. 13 ఏళ్ల క్రితం విడాకుల కోసం దాఖలైన పిటిషన్‌కు సంబంధించి మంగళవారం కేరళ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. జంట వివాహాన్ని రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. భర్త మానసిక వేధింపులు, క్రూరత్వాన్ని (Mental Cruelty) భరించలేని ఓ మహిళ పెళ్లి అయిన నెల రోజులకే విడిపోయింది. అనంతరం విడాకుల(Divorce) కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినా.. భర్త అప్పీలు చేయడంతో కేరళ హైకోర్టు(Kerala High Court)లో విచారణ జరిగింది.

భార్యను భర్త తక్కువ చేసి మాట్లాడటం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది. భార్యను తన అంచనాలకు తగినట్లు లేదని భర్త పదే పదే చెప్పడం, ఇతర స్త్రీలతో పోల్చడం, హేళన చేయడం మానసికంగా హింసించినట్లు అవుతుందని హైకోర్టు పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక మహిళ తన భర్త నుంచి ఇలాంటి ప్రవర్తనను సహిస్తుందని ఊహించలేమని పేర్కొన్నారు. క్రూరత్వం కారణంగా 13 ఏళ్ల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న జంట వివాహాన్ని ఈ సందర్భంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జంటకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త అప్పీల్ దాఖలు చేయడంతో హైకోర్టులో విచారణ జరిగింది.

* నెల రోజులే కలిసున్న జంట

మహిళ తన పిటిషన్‌లో..‘వివాహం జరిగినప్పటి నుంచి భర్త నన్ను శారీరకంగా ఆకర్షణీయంగా చూడలేదు. 2009లో వివాహం చేసుకున్నప్పటి నుంచి అతని ప్రవర్తనతో విరక్తి చెందాను. అతను కలిసిన కొందరు స్త్రీల కంటే అందమైన దానికి కాదని హింసించేవాడు.’ అని పేర్కొన్నారు. తన అంచనాలకు తగిన విధంగా భార్య లేదని భర్త సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. పెళ్లయిన తర్వాత నెల రోజుల పాటు మాత్రమే వారు కలిసి ఉండటం గమనార్హం.

ఇది కూడా చదవండి : లైంగిక భాగస్వాముల సంఖ్యలో పురుషుల కంటే ముందున్న స్త్రీలు.. సర్వేలో షాకింగ్ విషయాలు..

 ఈ కేసులో భర్త అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సామాజిక భావనలు, జీవన ప్రమాణాల పురోగతికి అనుగుణంగా క్రూరత్వానికి సమగ్ర నిర్వచనాన్ని అందించడం కష్టమని కోర్టు పేర్కొంది. నిరంతర చెడుగా ప్రవర్తించడం, వైవాహిక సంబంధాలను నిలిపివేయడం, ఇవన్నీ మానసిక లేదా చట్టపరమైన క్రూరత్వానికి దారితీసే కారకాలని తెలిపింది.


శారీరక క్రూరత్వంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉండవచ్చని, కానీ మానసిక క్రూరత్వం విషయంలో సాధ్యం కాకపోవచ్చని న్యాయస్థానం తెలిపింది. క్రూరత్వంగా పరిగణించాలంటే, ఫిర్యాదు చేసిన ప్రవర్తన తీవ్రంగా, భరించలేనిదిగా ఉండాలని పేర్కొంది. ఇలాంటి సందర్భంలో ఇద్దరూ కలిసి జీవించాలని అనుకోమని, మానసిక క్రూరత్వం అనేది అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, నోటి దుర్వినియోగం, అవమానించడంతో ఉంటుందని తెలియజేసింది. ఎదుటి వ్యక్తి శాంతికి నిరంతరం భంగం కలిగిస్తూ ఉంటే క్రూరత్వంగా భావించవచ్చని స్పష్టం చేసింది.

First published:

Tags: Divorce, Kerala, National News, Relationship, Wife and husband

ఉత్తమ కథలు