హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Domestic Violence: " గర్భాన్ని తొలగించుకోవడానికి మహిళకు భర్త అనుమతి అవసరం లేదు "

Domestic Violence: " గర్భాన్ని తొలగించుకోవడానికి మహిళకు భర్త అనుమతి అవసరం లేదు "

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Domestic Violence: యువతి ఎకనామిక్స్‌లో బి.ఎ చేసింది. కానీ ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ అయింది. సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమవుతూనే కంప్యూటర్‌ కోర్సులో చేరింది. ఈ క్రమంలో ఆమె బస్‌ కండక్టర్‌గా పని చేస్తున్న 26 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కన్నవారిని కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని అత్తింట్లో అడుగుపెట్టిన యువతి చిత్రహింసలు అనుభవించి పుట్టింటికే చేరింది. కట్నం కోసం అత్త, భర్త పెడుతున్న బాధలను భరిస్తున్న క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. చివరికి పుట్టబోయే బిడ్డకు తాను కారణం కాదని భర్త ఆమెను అనుమానాలతో వేధించడంతో ఇక చేసేది లేక ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. గర్భం తొలగించుకోవడానికి అనుమతి కోరింది. ఈ క్రమంలో సోమవారం కేరళ హైకోర్టు (Kerala High Court ) ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. గృహహింస బాధితురాలైన బాధిత యువతి గర్భం తొలగించుకోవడానికి (Termination of Pregnancy) భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

* అబార్షన్‌కు అనుమతి

వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ కొట్టాయంకు చెందిన 21 ఏళ్ల యువతి ఇటీవల కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ వీజీ అరుణ్‌ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లో గర్భాన్ని తొలగించుకోవడానికి స్త్రీ తన భర్త అనుమతిని పొందాలనే నిబంధన లేదని కోర్టు పేర్కొంది. గర్భం దాల్చిన సమయంలో, ప్రసవం సమయంలో ఒత్తిడిని భరించేది స్త్రీ అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

గర్భంతో ఉన్న మహిళ వైవాహిక జీవితాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఆమె జీవితంలో తీవ్రమైన మార్పును తీసుకొస్తుందని, విడాకుల పత్రాలు లేవనే కారణం ఆమె హక్కులను ఏ మాత్రం పరిమితం చేయలేవని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొట్టాయంలోని మెడికల్ కాలేజీ లేదా మరేదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భం తొలగించుకునేందుకు వివాహితకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

* అత్తింట్లో వేధింపులు

పిటిషన్‌ దాఖలు చేసిన యువతి ఎకనామిక్స్‌లో బి.ఎ చేసింది. కానీ ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ అయింది. సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమవుతూనే కంప్యూటర్‌ కోర్సులో చేరింది. ఈ క్రమంలో ఆమె బస్‌ కండక్టర్‌గా పని చేస్తున్న 26 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో ఆమె, ఆ యువకుడితో కలిసి పారిపోయింది. బస్‌ కండక్టర్‌ని పెళ్లి చేసుకొని అతని ఇంట్లో అడుగు పెట్టిన యువతికి అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని భర్త, అత్త చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచి ముగ్గురు విద్యార్థినులు పరార్.. భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధమైన ఇద్దరు అమ్మాయిలు..!

ఈ క్రమంలోనే యువతి గర్భవతి అయింది. కట్నం కోసం వేధించడమే కాకుండా.. పుడుతున్న బిడ్డపై భర్త అనుమానాలు వ్యక్తం చేశాడు. పుట్టబోయే బిడ్డకు తాను తండ్రి కాదని ఆరోపిస్తూ.. ఆమెకు ఆర్థికంగా, మానసికంగా ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వలేదు. అత్త, భర్త ప్రవర్తనతో విసిగిపోయిన యువతి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. చివరికి తండ్రి ఇంటికి చేరుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. భర్తను విడిచిపెట్టాలని, పుట్టింటికి వెళ్లిపోవాలని చిత్రహింసలు పెట్టినట్లు యువతి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ముందు కూడా భార్యతో తిరిగి కాపురం చేసేందుకు భర్త ఆసక్తి చూపలేదు.

* మెడికల్ బోర్డు సూచన

ఈ పరిస్థితుల్లో యువతి గర్భం కొనసాగించడం వల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మెడికల్ బోర్డు అభిప్రాయపడింది. లీగల్‌గా భర్తకు విడాకులు ఇవ్వలేదని, చట్టపరమైన పత్రాలు లేవనే కారణంతో ఆమె గర్భం తొలగించుకోవడాన్ని నిరాకరించకూడదని తెలిపింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Kerala, National News, Pregnancy, Wife and husband

ఉత్తమ కథలు