నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. హైకోర్టును ఆశ్రయించిన భర్త.. షాకింగ్ ఆరోపణలు.. హైకోర్టు ఏమందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తన భార్యకు పుట్టిన బిడ్డతో తనకు సంబంధం లేదని, బిడ్డకు తాను తండ్రిని కాదని కోర్టును ఆశ్రయించాడు.  డీఎన్‌ఏ పరీక్ష (DNA test) జరిపించాలని కోరాడు.

 • Share this:
  ఓ వ్యక్తి తన భార్యకు పుట్టిన బిడ్డతో తనకు సంబంధం లేదని, బిడ్డకు తాను తండ్రిని కాదని కోర్టును ఆశ్రయించాడు.  డీఎన్‌ఏ పరీక్ష (DNA test) జరిపించాలని కోరాడు. ఈ సందర్భంగా అతడు ఇన్‌ఫెర్టిలిటీ(infertility) సర్టిఫికెట్‌ను కూడా కోర్టుకు అందజేశాడు. అలాగే తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం చెందిన పిటిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో పనిచేస్తున్న అతనికి 2006, మే 5వ తేదీన అతనికి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 22 రోజుల తర్వాత అతడు ఉద్యోగ నిమిత్తం లద్దాఖ్(Ladakh) వెళ్లాడు. అయితే ఈ 22 రోజులలో గానీ, ఆ తర్వాత గానీ అతడు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోలేదు. అయితే 2007 మే 9వ తేదీన అతని భార్య బిడ్డకు జన్మనిచ్చింది.

  అయితే పిటిషనర్ తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు ఆమె సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. అతడి వల్లే తన భార్యకు కొడుకు పుట్టాడని చెప్పుకొచ్చాడు. తాను ఇన్‌ఫెర్టిలిటీ ఉందని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి తిరువనంతపురంలోని ఓ డాక్టర్ జారీ చేసిన సర్టిఫికేట్‌ను కూడా కోర్టు ముందు ఉంచాడు. తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోలేదని, తన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల తండ్రి కావడం కష్టమని చెప్పుకొచ్చాడు.

  IT Jobs: ఐటీ రంగంలో ఉద్యోగాల జాతర.. ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు, బోనస్​లు.. కారణాలివే!

  తొలుత అతడు తన భార్య నుంచి విడాకులు(divorce) కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ దశలో ఉన్నప్పుడే తన భార్య జన్మనిచ్చిన తండ్రిని తాను కాదని పేర్కొన్నాడు. డీఎన్‌ఏ పరీక్ష జరిపించాలని కోరాడు. ఈ క్రమంలోనే అతడు కేరళ హైకోర్టును (Kerala High Court) ఆశ్రయించాడు. అయితే అతడిని పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు ముహమ్మద్ ముస్తాక్, కౌసర్ ఎడప్పగాత్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

  Very Sad: తన మూత్రం తానే తాగిన తల్లి.. పిల్లలకు పాలు పట్టించి బతికించుకోవడానికి తల్లి చేసిన త్యాగం.. కానీ పాపం చివరకు..

  ‘పిటిషనర్ సంతానం పొందే అవకాశం లేదని డాక్టర్ సాక్ష్యం ఇచ్చారు. సర్టిఫికెట్ జారీ చేయడానికి ముందు పిటిషర్ వీర్యం పరీక్ష నిర్వహించబడిందని డాక్టర్ చెప్పారు. దీనిని ప్రాథమిక ఆధారంగా చేసుకుని పిటిషనర్ తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి కాదని కేసు వేశారు’అని హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టుగా చెప్పింది. పిటిషనర్ భార్యకు జన్మించిన బిడ్డ(మైనర్).. ఇందులో తప్పనిసరిగా పార్టీ కాదని పేర్కొంది. ఇక, డీఎన్‌ఏ టెస్ట్‌కు అనుమతించింది. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో DNA పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
  Published by:Sumanth Kanukula
  First published: