పౌరసత్వ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేరళ... దేశంలోనే ఇలా చేసిన తొలి రాష్ట్రం

సుప్రీంకోర్టు తలుపు తట్టిన కేరళ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేసింది. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రకటన చెయ్యాలని సుప్రీంకోర్టును కోరింది.

news18-telugu
Updated: January 14, 2020, 10:29 AM IST
పౌరసత్వ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేరళ... దేశంలోనే ఇలా చేసిన తొలి రాష్ట్రం
పినరయ్ విజయన్
  • Share this:
కేరళ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ప్రకటన చెయ్యాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. పౌరసత్వ చట్టంపై ఇలా సుప్రీంకోర్టు మెట్లెక్కిన తొలి రాష్ట్రం కేరళే. డిసెంబర్‌లో కేరళ అసెంబ్లీ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లకు దారితీస్తున్న పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కేరళ ప్రభుత్వ తీర్మానాన్ని ఎమ్మెల్యేలంతా సమర్థించారు. బీజేపీకీ చెందిన రాజగోపాల్ మాత్రం సమర్థించలేదు. తీర్మానం చేసిన కేరళ సీఎం పినరయ్ విజయన్... కేంద్రంలో బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. RSS అజెండాను ప్రజల నెత్తిన రుద్దుతూ... మతపరమైన వివాదాలు తలెత్తేలా చేస్తూ... ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు.


నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. కేరళలో ఎలాంటి నిర్భంద కేంద్రాలూ ఉండటానికి వీల్లేదు. కేరళకు లౌకిక రాష్ట్రంగా చిరకాల చరిత్ర ఉంది. గ్రీకులు, రోమన్లు, అరబ్బులూ అందరూ మన భూమికి వచ్చారు. క్రైస్తవులు, ముస్లింలు అందరికంటే ముందే ఇక్కడకు వచ్చారు. మన సంస్కృతి సమ్మిళితమైనది. ఆ సంస్కృతిని బతికించాల్సిన అవసరం మన అసెంబ్లీకి ఉంది -
పినరయ్ విజయన్


పార్లమెంట్ ఉభయ చట్టాల్లో ఆమోదించిన పౌరసత్వ చట్టం దేశంలోని వేర్వేరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ చట్టానికి వ్యతిరేకంగా కేరళలోనూ ఆందోళనలు జరిగాయి. అయితే కేరళలో శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
పినరయ్ విజయన్.
కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి చట్టబద్ధత లేదని అంటున్నారు. పౌరసత్వ చట్టం అన్నది కేంద్ర పరిధిలోది కాబట్టి... రాష్ట్ర తీర్మానానికి రాజ్యాంగబద్ధత ఉండదని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: January 14, 2020, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading